Wife and Husband: భార్య ముఖంపై అకస్మాత్తుగా పెరిగిన మీసాలు, గడ్డం.. మరి ఆ భర్త ఏం చేశాడంటే..!

సాధారణంగా పురుషులకు గడ్డం, మీసాలు వస్తాయి. ప్రత్యేక పరిస్థితుల్లోనే కొందరు ఆడవారికి కూడా లైట్‌గా మీసాలు, గడ్డం వస్తాయి. కానీ, పంజాబ్‌కు చెందిన ఓ మహిళ భారీగా గడ్డం, మీసాలు పెంచింది.

Wife and Husband: భార్య ముఖంపై అకస్మాత్తుగా పెరిగిన మీసాలు, గడ్డం.. మరి ఆ భర్త ఏం చేశాడంటే..!
Woman
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 20, 2023 | 8:20 AM

సాధారణంగా పురుషులకు గడ్డం, మీసాలు వస్తాయి. ప్రత్యేక పరిస్థితుల్లోనే కొందరు ఆడవారికి కూడా లైట్‌గా మీసాలు, గడ్డం వస్తాయి. కానీ, పంజాబ్‌కు చెందిన ఓ మహిళ భారీగా గడ్డం, మీసాలు పెంచింది. అయితే, అకస్మాత్తుగా వచ్చిన ఈ గడ్డం, మీసాలు చూసి బెదిరిపోయిన భర్త.. ఆమెకు విడాకులు ఇచ్చాడు. అయితే, భర్త తనను వదిలేసినా.. ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. వాస్తవాన్ని గ్రహించి కొత్త జీవితాన్ని ధైర్యం గడుపుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పంజాబ్‌కు చెందిన మన్‌దీప్ కౌర్ 2012లో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే, కొన్నేళ్ల తర్వాత ఆమె శరీరంలో హార్మోన్ల మార్పుల కారణంగా ముఖంపై గడ్డం, మీసాలు రావడం మొదలైంది. మొదట్లో డిప్రెషన్‌లో ఉన్న ఆమె ఆ తర్వాత వాస్తవాన్ని గ్రహించి ముఖంపై గడ్డం పెంచింది. అయితే, గడ్డం, మీసాలు పెంచిన మహిళతో కలిసి జీవించడం సిగ్గుచేటని ఆమె భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇంతటి విషమ పరిస్థితులను సైతం ఎదుర్కొంటూ తన కొత్త జీవితాన్ని హ్యాపీగా గడుపుతోంది మన్‌దీప్ కౌర్.

ఇప్పుడు 31 ఏళ్ల వయసులో ఆమె లైఫ్ స్టైల్ మారిపోయింది. రైతు కుటుంబంలో పుట్టిన ఆమె వ్యవసాయం చేస్తూ అందమైన జీవితాన్ని గడుపుతున్నారు. మందపాటి గడ్డం, తలపాగా, ముఖంపై పెరిగిన వెంట్రుకలను తొలగించకుండా ద్విచక్రవాహనంపై రయ్‌మంటూ దూసుకెళ్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా, ఇలాంటి సమస్య ఆమెకే కాదు.. ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. అయినప్పటికీ చేసేదేమీ లేదని భావించి, జీవితాన్ని గడుపుతోంది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా పిసిఒఎస్, మహిళల హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేసే పరిస్థితి కారణంగా ఆమెకు గడ్డం ఈ విధంగా అభివృద్ధి చేసిందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..