Patna Junction: హఠాత్తుగా రైల్వే ప్లాట్ ఫామ్‌పై టీవీ స్క్రీన్‌పై బ్లూ ఫిల్మ్.. సిగ్గుతో తలదించుకున్న ప్రయాణీకులు

పాట్నా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన టీవీలో దాదాపు మూడు నిమిషాలకు పైగా బ్లూ ఫిల్మ్ ప్లే అవుతూనే ఉందని చెబుతున్నారు.

Patna Junction: హఠాత్తుగా రైల్వే ప్లాట్ ఫామ్‌పై టీవీ స్క్రీన్‌పై బ్లూ ఫిల్మ్.. సిగ్గుతో తలదించుకున్న ప్రయాణీకులు
Patna Junction
Follow us
Surya Kala

|

Updated on: Mar 20, 2023 | 7:58 AM

బీహార్ రాజధాని పాట్నాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రయాణీకుల సౌకర్యార్థం లేదా ప్రకటన కోసం  రైల్వే జంక్షన్ ప్లాట్‌ఫారమ్‌పై అమర్చిన టీవీ సెట్‌లో అకస్మాత్తుగా బ్లూ ఫిల్మ్ ప్లే కావడం ప్రారంభించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా రైల్వే స్టేషన్ లో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై భారీ సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా బ్లూ ఫిల్మ్ ప్లే కావడంతో  ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు సిగ్గుతో తలలు దించుకున్నారు.

ఈ ఘటనను ఆర్పీఎఫ్ సీరియస్‌గా తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం ప్రకారం, ఈ సంఘటన ఉదయం 9-10 గంటల మధ్య ప్లాట్‌ఫారమ్ నంబర్ 10 పై జరిగింది. ప్లాట్‌ఫారమ్‌లోని టీవీ సెట్‌లో ఈ చిత్రం ప్రసారం అయిన వెంటనే.. అక్కడున్న పలువురు ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఒక్కసారిగా రైల్వే స్టేషన్ లో కలకలం రేగింది.

3 నిమిషాల పాటు సాగిన బ్లూ ఫిల్మ్ పాట్నా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన టీవీలో దాదాపు మూడు నిమిషాలకు పైగా బ్లూ ఫిల్మ్ ప్లే అవుతూనే ఉందని చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత పాట్నా RPF ఇంచార్జి ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో సమాచారం ఇవ్వడం.. చిత్రాలను ప్రసారం చేసే బాధ్యత దత్తా కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్‌కు ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి.. ఇంతకు ముందు టీవీ సెట్‌లో కొన్ని యాడ్స్.. సమాచారం ప్రసారం అయినట్లు.. ఇంతలోనే  ఒక్కసారిగా బ్లూ ఫిల్మ్ ప్లే అవ్వడం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దత్తా కమ్యూనికేషన్‌పై రైల్వే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..