- Telugu News Photo Gallery Uttar Pradesh: Grain ATM set up aiming to automate Public Distribution System
Grain ATM: డబ్బు పెట్టగానే ATM నుండి బియ్యం, గోధుమలు.. ఈ ‘ధాన్యం ATM’ ఎక్కడ ప్రారంభమైందంటే..
లక్నో జిల్లా సరఫరా అధికారి సునీల్ సింగ్ మాట్లాడుతూ.. దేశంలో మొత్తం 9 ధాన్యం ఏటీఎంలు మాత్రమే ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏటీఎంలు వారణాసి, గోరఖ్‌పూర్, లక్నోలో ఏర్పాటు చేయబడ్డాయని పేర్కొన్నారు.
Updated on: Mar 19, 2023 | 11:43 AM

లక్నో జిల్లా సరఫరా అధికారి సునీల్ సింగ్ మాట్లాడుతూ.. దేశంలో మొత్తం 9 ధాన్యం ఏటీఎంలు మాత్రమే ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏటీఎంలు వారణాసి, గోరఖ్‌పూర్, లక్నోలో ఏర్పాటు చేయబడ్డాయని పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ పౌరులు ఇకపై బియ్యం, గోధుమలను కొనుగోలు చేయడానికి కిరాణా దుకాణాల వద్ద పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నగర వాసులు పాలు, నీరు , డబ్బు వంటి వాటిని ఏ విధంగా ATM నుండి తీసుకుంటున్నారో.. అదే విధంగా రేషన్ తీసుకుంటారు. ఇందుకోసం నిర్ణీత ఛార్జీల ప్రకారం కొంత డబ్బును ఏటీఎంలో పెట్టాల్సి ఉంటుంది.

ఆర్థికంగా వెనుకబడిన ప్రజల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ రేషన్ ఏటీఎంను ప్రారంభించింది. రాజధాని లక్నోలో 'గ్రెయిన్ ఏటీఎం' పేరుతో ఈ వ్యవస్థను ప్రారంభించారు.

జిల్లా సరఫరా అధికారి సునీల్‌సింగ్ మాట్లాడుతూ.. ఈ 'గ్రెయిన్ ఏటీఎం' ఏర్పాటుతో తూకాల కష్టాలు తీరాయన్నారు. వినియోగదారులు నిర్ణయించిన ధర ప్రకారం ఏటీఎంలో డబ్బులు వేస్తే లోపల నుంచి అంతే మొత్తంలో బియ్యం, గోధుమలు వస్తాయి.

గతంలో బియ్యం, గోధుమలు తదితరాలను తూకాలతో తూకం వేసి వినియోగదారులకు ఇచ్చేవారని, ఇప్పుడు ధాన్యం ఏటీఎంల ద్వారా వినియోగదారులకు రేషన్ పంపిణీ చేసే పని జరుగుతుందని సునీల్ సింగ్ తెలిపారు. గతంలో తక్కువగా లభించే రేషన్‌పై ఇక నుంచి ఎలాంటి ఫిర్యాదు ఉండదని ఒక వినియోగదారు తెలిపారు.

జిల్లా సప్లయ్ అధికారి సునీల్ సింగ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 9 ఏటీఎంలు మాత్రమే ఏర్పాటు చేశామని, అందులో వారణాసి, గోరఖ్‌పూర్, లక్నోలో ఈ ఏటీఎంలు ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిని ఏర్పాటు చేసిన అనంతరం ఇక నుంచి తమకు బియ్యం, గోధుమలు వచ్చిన తక్కువ బరువు ఉన్నాయన్న ఫిర్యాదు అందవని పేర్కొన్నారు. ఇది భారతదేశంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైంది. ఈ ఏటీఎం ధర 12-15 లక్షల రూపాయాలుంటుందని పేర్కొన్నారు.





























