అనేకవ్యాధులు వ్యాపించడానికి మూల కారకమైన కీటకము ఈగపై శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన పరిశోధనలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ ఈగలు స్వలింగ సంపర్కులుగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మగ, ఆడ ఈగలు ఒకదానికొకటి తేడాను గుర్తించలేకపోతున్నాయని. అంటే సంభోగం చేసే ముందు మగ ఈగ ఆడ ఈగతో చేస్తుందా లేక మగ ఈగతో చేస్తుందా అని నిర్ణయించుకోలేకపోతుందని చెప్పారు. దీంతో రోజు రోజుకీ ఈగల్లో స్వలింగ సంపర్కాలు ఎక్కువ అయ్యాయని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. జర్మనీకి చెందిన మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కెమికల్ ఎకాలజీకి చెందిన పరిశోధకులు ఇటీవలి పరిశోధనలో విషయాలను ప్రపంచానికి తెలియజేశారు.