Sore Throat: గొంతు నొప్పి వేధిస్తోందా? ఇలా చెస్తే నొప్పి మటుమాయం..!
మీ గొంతులో గడ్డ ఉన్నట్లుగా అనిపిస్తుందా? ఆహారం మింగడం కష్టంగా ఉందా? గొంతులో నొప్పి, కరుకుదనం, పొడిబారినట్లుగా ఉంటోందా? అయితే, మీరు బహుశా గొంతు నొప్పితో బాధపడుతున్నారు.
మీ గొంతులో గడ్డ ఉన్నట్లుగా అనిపిస్తుందా? ఆహారం మింగడం కష్టంగా ఉందా? గొంతులో నొప్పి, కరుకుదనం, పొడిబారినట్లుగా ఉంటోందా? అయితే, మీరు బహుశా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. శ్లేష్మ పొర సాధారణ వాపు ప్రాథమికంగా గొంతు నొప్పికి కారణం. అలాంటి సమయంలో భయపడాల్సిన పని లేదు. కొన్ని ఇంటి నివారణలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి.
గొంతు నొప్పికి కారణాలు..
1. చాలా పొడి వాతావరణం.
2. వాయు కాలుష్యం – పొగ, దుమ్ము.
3. అలెర్జీ, ఆస్తమా.
4. వైరల్ జ్వరం, సాధారణ జలుబు.
5. శ్వాసకోశ సంక్రమణ వ్యాధులు.
6. ఉబ్బిన గ్రంధులు.
ఇలా పుక్కిలించండి..
ఉప్పునీరు: అర టీస్పూన్ రాళ్ల ఉప్పును గోరువెచ్చని నీటిలో కరిగించి పుక్కిలించాలి. ఇది మీ గొంతులో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శ్లేష్మం వెళ్లడానికి సహాయపడుతుంది.
హెన్నా ఆకులు: హెన్నా ఆకులతో డికాక్షన్ చేసి పుక్కిలించొచ్చు.
యాలకుల పొడి: నీళ్లలో యాలకుల పొడిని కరిగించి, వడకట్టి పుక్కిలించాలి.
మెంతి గింజలు: నీటిలో మరిగించి, వడకట్టి పుక్కిలించాలి.
పసుపు నీరు: పసుపు ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్. ½ టీస్పూన్ పసుపు పొడిని ½ టీస్పూన్ ఉప్పును వేడి నీటిలో కలపాలి. ప్రతి 2 గంటలకు గార్గిల్ చేయండి.
తులసి నీరు: తులసి ఆకులతో నీటిని మరిగించాలి. వడకట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని త్రాగవచ్చు. లేదా పుక్కిలించవచ్చు.
నిమ్మ / అల్లం నీరు త్రాగాలి:
గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు తేనె సహాయపడుతుంది.
వెచ్చని డ్రింక్స్ మాత్రమే త్రాగాలి..
1. వెచ్చని ద్రవాలు మీ గొంతును తేమ, పొడి గొంతు, నిర్జలీకరణం మొదలైన సమస్యలను నిరోధించడంలో సహాయపడతాయి. వేడి డ్రింక్స్ తీసుకోవచ్చు.
2. అల్లం, తేనె టీ అనేది గొంతు మంటను తగ్గించడానికి ఒక ప్రసిద్ధమైన డ్రింక్.
3. రెడ్ హైబిస్కస్ టీ మీ గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. రెడ్ హైబిస్కస్ టీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
4. గొంతు తేమగా ఉండాలంటే ఎప్పటికప్పుడు గోరువెచ్చని నీటిని తాగాలి.
5. తమలపాకులు నమలాలి. తమలపాకులు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించే పురాతన, సాంప్రదాయ ఔషధం. తమలపాకులు, తులసి ఆకులను నీటిలో వేసి మరిగించవచ్చు. వడకట్టి ఆ నీటిని తాగాలి. రుచి కోసం తేనె లేదా ఉప్పును యాడ్ చేసుకోవచ్చు.
6. లవంగాలను నమలాలి. నోట్లో పగుళ్లు, పుళ్లు అయితే లవంగాలను నోట్లు వేసుకుని ఉంచుకోవాలి. తద్వారా ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..