- Telugu News Lifestyle If you take cinnamon in your diet every day, it is sure to keep fat and sugar under control Telugu Lifestyle News
Cinnamon Benefits: ప్రతిరోజూ దాల్చిన చెక్కను ఆహారంలో చేర్చుకుంటే.. ఆ అనారోగ్య సమస్యలు దరిచేరవు నమ్మండి..
డయాబెటిస్ డైట్ చిట్కాలు: భారతీయుల వంటగదిలో అత్యంత సాధారణ లభించే మసాలా దాల్చిన చెక్క. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు దాల్చిన చెక్క ప్రయోజనాలు తెలుస్తే ఆశ్చర్యపోతారు.
Madhavi | Edited By: TV9 Telugu
Updated on: Jul 05, 2023 | 6:03 PM

డయాబెటిస్ డైట్ చిట్కాలు: భారతీయుల వంటగదిలో అత్యంత సాధారణ లభించే మసాలా దాల్చిన చెక్క. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు దాల్చిన చెక్క ప్రయోజనాలు తెలుస్తే ఆశ్చర్యపోతారు.

భారతీయుల వంటగదిలో తప్పకుండా మసాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అందులో ముఖ్యమైంది దాల్చిన చెక్క. మధుమేహ వ్యాధిగ్రస్తులకు దాల్చిన చెక్క ప్రయోజనాలు తెలుస్తే ఆశ్చర్యపోతారు. ఈ మసాలా మంచి వాసనతోపాటు రుచిని కలిగి ఉంటుంది. మీ ఆహారానికి మరింత రుచిని అందిస్తుంది. అంతేకాదు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.

ఒక చిటికెడు దాల్చినచెక్కలో ఇన్సులిన్ హార్మోన్ స్రావం, ప్రభావాన్ని పెంచే లక్షణాలు ఉన్నాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అందువల్ల, డయాబెటిక్ రోగులకు దాల్చిన చెక్క గొప్ప ఔషధం.

మధుమేహగ్రస్తులు శరీరంలో మంటతో బాధపడుతుంటారు. మధుమేహం మూత్రపిండాలు, పాదాలు, కళ్ళు, గుండెపై అనేక విధాలుగా ప్రభావితం చూపుతుంది. ఇలాంటప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దాల్చిన చెక్కను ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

దాల్చిన చెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా మధుమేహం లక్షణాలు అదుపులో ఉంటాయి. మరోవైపు, ఈ మసాలా బరువును అదుపులో ఉంచుతుంది.

అయితే దాల్చిన చెక్కతో ఎలా ప్రయోజనం పొందాలో తెలుసా? నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేడి పాలలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్ తాగండి.

మీరు దాల్చిన చెక్క డిటాక్స్ నీటిని కూడా త్రాగవచ్చు. ఒక చిన్న దాల్చిన చెక్కను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. ఇది బరువును తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.





























