Jasmine Flowers: పెళ్లిళ్ల సీజన్ కావడంతో మల్లెపూలకు డిమాండ్ .. కొండెక్కిన ధరలు..

పెళ్లీల సీజన్‌ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు కొండెక్కాయి. వాసన చూద్దామంటే..మల్లెపువ్వు కరువైపోయిందంటున్నారు కోనసీమవాసులు.  

Jasmine Flowers: పెళ్లిళ్ల సీజన్ కావడంతో మల్లెపూలకు డిమాండ్ .. కొండెక్కిన ధరలు..
Jasmine Flowers
Follow us
Surya Kala

|

Updated on: Mar 16, 2023 | 6:51 AM

వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది. అయితే మల్లెల సీజన్ వచ్చినా మల్లెపూల ధరలు మండిపోతున్నాయి. ఓ వైపు పెళ్లీల సీజన్‌ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు కొండెక్కాయి. వాసన చూద్దామంటే..మల్లెపువ్వు కరువైపోయిందంటున్నారు కోనసీమవాసులు.

మల్లెపూలు సువాసనతో మత్తెక్కిస్తాయి. కానీ..పెరిగిన ధరలు వినియోగదారుడికి చెమటలు పట్టిస్తున్నాయి. పెళ్లీల సీజన్‌ కావడంతో మల్లెపూలకు గిరాకీ పెరిగింది. దాంతో వాటి ధరలు కొండెక్కాయి. కొందామంటేనే జనం హడలిపోయే పరిస్థితి నెలకొంది. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఎండలే కాదు…మల్లెపూల ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌లో కేజీ మల్లెపూల ధరలు వెయ్యి రూపాయల నుండి 12 వందలు పలుకుతున్నాయి. పూల ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు కొనాలంటేనే భయపడి పోతున్నారు.

పెళ్లిళ్ల సీజన్ కావడంతో మల్లెపూలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మల్లెపూల ధరలు భారీగా పెరిగిపోయాయి. మల్లెపూల పంట ఆరంభం దశ కావడంతో ఇంకా పూర్తి స్థాయిలో పంట అందుబాటులోకి రాకపోవడంతో డిమాండ్‌కి తగ్గ సరుకు లేకపోవడంతో ధరలు పెరిగిపోయాయి. బహిరంగ మార్కెట్లో కిలో మల్లెపూల ధర 15 వందలు పలుకుతోంది. వేసవి కాలంలోనే లభించే పూలు కావడంతో మగువలు అధికంగా వీటిని ఇష్టపడతారు. ఐతే పూర్థిస్థాయిలో అందుబాటులోకి వస్తే ధరలు తగ్గుతాయంటున్నారు వ్యాపారస్తులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..