Indrakeeladri: దుర్గ గుడిలోని కేశఖండనశాలో దోపిడీ.. కత్తెర పడాలంటే రూ. 500 ఇవ్వాల్సిందే.. లేదంటే కత్తిగాటు తప్పదు..
ఇంద్రకీలాద్రిలో భక్తుల నుంచి ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారు. దేవస్థానం సిబ్బంది సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులను నిలువునా దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ప్రముఖ క్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గాదేవిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తుతారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి దర్శనం కోసం భక్తులు వస్తారు. తమ మొక్కులు చెల్లించుకుని దుర్గాదేవిని దర్శించుకుంటారు. అయితే భక్తుల నమ్మకాన్ని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇంద్రకీలాద్రిలో భక్తుల నుంచి ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారు. దేవస్థానం సిబ్బంది సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులను నిలువునా దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేశఖండనశాలో తలనీలాలు సమర్పించే భక్తుల నుండి సిబ్బంది అధిక ధరలు వసూలు చేస్తున్నారు. భక్తుల సెంటిమెంటును ఆసరాగా తీసుకుని దేవాలయ సిబ్బంది దోపిడీ చేసుకుంటున్నారు. భక్తులు సమర్పించే తలనీలాలు టికెట్ ధర 25 రూపాయలు.. టోకెన్ తీసుకుని కేశఖండన శాలలో తమ జుట్టుకుని సమర్పించుకోవాలంటే.. మళ్ళీ ఆలయ సిబ్బందికి డబ్బులు ఇవ్వాల్సిందే. కత్తెర వేయాలంటే రూ. 500 ఇచ్చుకోవాల్సిందే టోకెన్ ఉంది కదా అని ప్రశ్నించినా ఐదు వందలు ఇస్తేనే తలనీలాలు చేస్తాం లేకపోతే లేదు అని చెబుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇదేంటని గట్టిగా మాట్లాడితే తలపై మూడు, నాలుగు గాట్లు పెడుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. రోజూ దుర్గగుడిలోకి కేశఖండన శాలలో రోజు ఇదే తంతు అంటూ భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..