Bank Jobs: త్వరపడండి.. నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ. 40 వేల జీతం.. ఇలా అప్లై చేసుకోండి!
బ్యాంక్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా.? అయితే మీకో అలెర్ట్.. మొత్తం 546 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్..
బ్యాంక్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా.? అయితే మీకో అలెర్ట్.. మొత్తం 546 ఖాళీలను భర్తీ చేసేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుకు చివరి తేదీ మరో ఐదు రోజుల్లో ముగియనుంది. నిరుద్యోగులు త్వరపడాలి. మరి ఇంతకీ ఆ నోటిఫికేషన్ వివరాలు, ముఖ్యమైన తేదీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..?
దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా. తన వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలను విస్తరించేందుకు భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 546 ఖాళీలు ఉండగా.. ఇందులో అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులు 500, ప్రైవేటు బ్యాంకర్ పోస్టులు 15; వెల్త్ స్ట్రాటజిస్ట్ పోస్టులు 19 ఉన్నాయి. ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తు స్వీకరణ, ఫీజు చెల్లింపులు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రాగా.. మరో 5 రోజులు అనగా.. మార్చి 14తో గడువు ముగుస్తుంది. బ్యాంకింగ్ సెక్టార్‌లో జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న అర్హత కలిగిన అభ్యర్ధులకు ఇదొక చక్కటి అవకాశం కాగా.. వారు అక్విజిషన్ ఆఫీసర్, ప్రోడక్ట్ మేనేజర్‌తో సహా ఇతర పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు ఇలా..
- దరఖాస్తు ప్రారంభ తేదీ – ఫిబ్రవరి 22
- దరఖాస్తు చివరి తేదీ – మార్చి 14
- ఖాళీల సంఖ్య – 546(అక్విజిషన్ మేనేజర్ – 500, ప్రొడక్ట్ మేనేజర్ – 46)
- వయస్సు – 21-28(అక్విజిషన్ ఆఫీసర్స్), 24-50 (ఇతర పోస్టులకు)
- జీతం: మెట్రో నగరాల్లో పని చేసేవారికి – రూ. 5 లక్షలు(సంవత్సరానికి), నాన్-మెట్రో నగరాల్లో పని చేసేవారికి – రూ. 4 లక్షలు(సంవత్సరానికి)
- దరఖాస్తు ఫీజు – రూ. 600(జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్), రూ. 100(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ)
- ఎంపిక విధానం – షార్ట్‌లిస్టింగ్/ ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా
- పరీక్షా కేంద్రాలు – వైజాగ్, హైదరాబాద్