Kadapa: బ్రహ్మంగారి మఠం గ్రామంలో భూ వివాదం.. భూమికి కంచె వేస్తున్న సర్పంచ్.. కారం చల్లి అడ్డుకున్న గ్రామస్థులు

గురువారం... స్థానిక సర్పంచ్ ఓబులు రెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆగ్రహించిన జనం ఆ భూమికి కంచె వేస్తుండగా అడ్డుకున్నారు. వైసీపీ సర్పంచ్ ఓబుల్ రెడ్డిపై కారం పొడి చల్లి దాడి చేశారు.

Kadapa: బ్రహ్మంగారి మఠం గ్రామంలో భూ వివాదం.. భూమికి కంచె వేస్తున్న సర్పంచ్.. కారం చల్లి అడ్డుకున్న గ్రామస్థులు
Brahmamgari Matam Village
Follow us

|

Updated on: Mar 10, 2023 | 7:22 AM

కడప జిల్లా గుండాపురం మండలంలోని బ్రహ్మంగారి మఠం గ్రామంలో రాజుకున్న భూవివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. భూ ఆక్రమణలకు పాల్పడుతున్న వైసీపీ నేతలపై తిరగబడ్డారు గ్రామస్తులు. గురువారం… స్థానిక సర్పంచ్ ఓబులు రెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆగ్రహించిన జనం ఆ భూమికి కంచె వేస్తుండగా అడ్డుకున్నారు. వైసీపీ సర్పంచ్ ఓబుల్ రెడ్డిపై కారం పొడి చల్లి దాడి చేశారు.

కొంత కాలంగా బి.మఠం గ్రామంలో ఇరు వర్గాల మధ్య భూ వివాదం నెలకొంది. ఇరు వర్గాలు ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివాదాస్పద భూమిలో చదును చేసి, కంచె వేసేందుకు ప్రయత్నించిన వైసీపీ చెందిన రమణా రెడ్డి, వెంకట రమణా రెడ్డిల పై కర్రలతో సుమారు పది మంది డాడి చేశారు. కళ్ళలో కారం చల్లిన బత్తెల సిద్ధయ్య వర్గానికి చెందిన మహిళలు దాడికి దిగారు. గాయపడిన రమణారెడ్డి, వెంకట రమణారెడ్డి లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

అయితే దాడిలో గాయపడిన వర్గీయులు సిద్ధయ్య ఇంటిపై ప్రతి దాడి చేశారు. ఇంట్లో వస్తువులను ధ్వంసం చేసి, భీభత్సం సృష్టించారు. గర్భిణీ అనికూడా చూడకుండా తనని బయటకు లాగి..ఇల్లంతా ధ్వంసం చేసినట్టు బాధితురాలు పేర్కొంది. గుండాపురంలో దాడి ప్రతి దాడి నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. బి.మఠం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కావాలనే వైసిపి సర్పంచ్‌ భూమిని కబ్జా చేయాలని చూశారని అందులో భాగంగానే సిద్దయ్య వర్గం దాడి చేసినట్లు స్థానికులు చెపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..