Andhra Pradesh: రోగిని చికిత్స నిమిత్తం తరలిస్తున్న అంబులెన్స్‌లో హఠాత్తుగా మంటలు.. ఒకరికి గాయాలు
ఏసురాజు అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో సోమవారం ఏసురాజుకి డయాలసిస్ చేయించేందుకు ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. ఏసు రాజుతో పాటు అతని తల్లి అంబులెన్స్ లో బయలు దేరారు.
ఓ వ్యక్తి జీవితాన్ని కాపాడడం కోసం రోగిని తరలిస్తున్న అంబులన్స్ లో ప్రాణాలు నిలపడం కోసం ఇచ్చే ఆక్సిజన్ సిలెండర్ హఠాత్తుగా పేలింది. ఈ పేలుడు ధాటికి అంబులెన్స్ దగ్ధం అవ్వడమే కాదు.. మంటల్లోని శకలాలు సమీపంలోని పొగాకు బేళ్లపై ఎగిరి పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసి పడి.. పూర్తిగా పొగాకు నిల్వలు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని పామూరు మండలం రజాసాహెబ్‌పేటకు చెందిన ఏసురాజు అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో సోమవారం ఏసురాజుకి డయాలసిస్ చేయించేందుకు ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. ఏసు రాజుతో పాటు అతని తల్లి అంబులెన్స్ లో బయలు దేరారు. ఇలా అంబులెన్స్ కొంచెం దూరం వెళ్ళగానే.. హఠాత్తుగా డ్రైవర్ క్యాబిన్ లో మంటలు వ్యాపించాయి. ఇది చూసి అప్రమత్తమైన డ్రైవర్ అంబులెన్స్ ను రోడ్డు పక్కకు నిలివేశాడు. రోగిని , అతని తల్లిని వెంటనే కిందకు దింపి దూరంగా తీసుకుని వెళ్లారు.
అప్పుడు వ్యాపించిన మంటలు ఆక్సిజన్ సిలెండర్ కు చేరుకొని పేలుడు సంభవించింది. ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో.. అగ్ని కీలకలు ఎగిరి పడి పొగాకు మండెలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో రూ.40 లక్షలకు పైగా విలువైన పొగాకు దగ్ధం అయిందని రైతు కన్నీరు మున్నీరుగా విలపించాడు. సమీపంలోని ఒక వ్యక్తికీ తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..