AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెరీ కూల్‌..! కరెంట్‌తో పనిలేకుండానే చలి పుట్టించే ఫ్యాన్‌.. మీకు అందుబాటు ధరలోనే..

అంటే చల్లగాలిని ఆస్వాదించడానికి మీరు విద్యుత్తుపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యాన్‌లో వైబ్రేషన్ కూడా తక్కువే. అలాగే, దీని డిజైన్ కూడా చాలా బాగుంది.

వెరీ కూల్‌..! కరెంట్‌తో పనిలేకుండానే చలి పుట్టించే ఫ్యాన్‌.. మీకు అందుబాటు ధరలోనే..
Solar Fan
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 20, 2023 | 5:36 PM

ఎండాకాలం వచ్చేసింది. వేసవితాపం, ఉక్కపోత కారణంగా కూలర్లు, ఫ్యాన్లకు గిరాకీ పెరుగుతుంది. ప్రజల అవసరాలకు తగినట్టుగానే మార్కెట్లో కొత్త ఫ్యాన్లు, కూలర్లు, తక్కువ ధరలో లభించే ఏసీలు అందుబాటులోకి వస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కొత్త ఫ్యాన్‌కి సంబంధించిన సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. ఇది కరెంట్‌ అవసరం లేకుండానే గంటల తరబడి మీ గదిని కూల్‌గా మార్చేస్తుంది. మీరు కావాల్సిన డిస్కౌంట్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. వివరాల్లోకి వెళితే..

మీరు Flipkart నుండి SUN KING పోర్టబుల్ సోలార్ పవర్డ్ ఫ్యాన్‌ని ఆర్డర్ చేయవచ్చు. ఈ ఫ్యాన్ ధర రూ.7,999. ఈ ఫ్యాన్‌లో 5100 mAh అమర్చబడింది. 20W సోలార్ పవర్ ఫ్యాన్ గాలితో మీకు ఎలాంటి కంప్లైట్స్‌ ఉండవు. ప్రశాంతమైన చల్లదనాన్ని అనుభవిస్తారు. ఇది 16 అంగుళాల బ్లేడ్‌లతో వస్తుంది. మీరు ఇంట్లో, ఆఫీసులో రీచార్జిబుల్ సోలార్ ఫ్యాన్‌ని అమర్చుకోవచ్చు. అలాగే ఈ ఫ్యాన్‌ని మీరు ఎక్కడికైనా తీసుకువెళ్లటం కూడా ఈజీ.

మీరు దీన్ని టేబుల్ ఫ్యాన్, ఆఫీస్ డెస్క్, స్టడీ టేబుల్‌పై సులభంగా పెట్టుకోవచ్చని కంపెనీ పేర్కొంది. పవర్ కట్ సమయంలో మీరు వాటిని ఆఫీసులో ఇంట్లోనూ ఉపయోగించవచ్చు. ఇది చాలా ప్రదేశాలలో అత్యవసర ఫ్యాన్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే, మీరు గరిష్టంగా 18 గంటల వరకు బ్యాకప్ పొందుతారు. అయితే, ఎంత ఎక్కువ బ్యాకప్ పొందాలనుకుంటే, మీరు దీన్ని అంత తక్కువ-స్పీడ్ మోడ్‌లో ఉపయోగించాలి.

ఇవి కూడా చదవండి

దీనితో పాటు, ఈ ఫ్యాన్‌లో 20W సోలార్ ప్యానెల్ కూడా ఇన్‌స్టాల్ చేయబడింది. అంటే ఇది విద్యుత్తుపై ఆధారపడదు. దాని తక్కువ బరువు కారణంగా, ఇది ఇండోర్, అవుట్డోర్ రెండింటిలో ఉపయోగించవచ్చు. ఇందులో అనేక ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి. 20W సోలార్ ప్యానెల్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే చల్లగాలిని ఆస్వాదించడానికి మీరు విద్యుత్తుపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యాన్‌లో వైబ్రేషన్ కూడా తక్కువే. అలాగే, దీని డిజైన్ కూడా చాలా బాగుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం…