అమ్మ బాబోయ్.. ఈ నెయిల్ పాలిష్ బాటిల్ ధరతో ఢిల్లీలో లగ్జరీ ఫ్లాట్ కొనేయొచ్చట..!
మహిళలు నెయిల్ పాలిష్‌ను ఎంతగా ఇష్టపడతారో అందరికీ తెలిసిందే. మార్కెట్‌లో కొత్త డిజైన్‌తో ఏదైనా నెయిల్ పాలిష్ వచ్చిందని తెలిస్తే చాలు.. వెంటనే దాన్ని కొనేస్తారు.
Updated on: Mar 20, 2023 | 2:10 PM

సాధారణంగా ఒక చిన్న బాటిల్ నెయిల్ పాలిష్ ధర 50-100 లేదంటే.. 200-300 వరకు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే..రూ. 500 వరకు ఉంటుంది. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ కూడా ఒకటుందని మీకు తెలుసా..? దాని ధర తెలిస్తే నిజంగానే ఫ్యూజులవుట్ అవ్వాల్సిందే..!

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్‌ను అజాచర్ అని పిలుస్తారు. ఎందుకంటే దాని సృష్టికర్త పేరు లాస్ ఏంజిల్స్‌కు చెందిన డిజైనర్ అజాచర్ పోగోసియన్. పోగోసియన్ అనేక రకాల నెయిల్ పాలిష్‌లను తయారు చేసినప్పటికీ, ఐజాతుర్ వాటిలో చాలా ప్రత్యేకమైనది. పైగా ఇది అత్యంత ఖరీదైనది.

ఈ బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ కొనడం అందరికీ అంత సులువైన విషయం కాదు. దీన్ని కొనాలంటే పెద్ద పెద్ద ధనవంతులకు కూడా చెమటలు పట్టేస్తాయి. ఎందుకంటే దీని ధరతో ఢిల్లీ వంటి నగరంలో మీరు విలాసవంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేయవచ్చు. లేదంటే ఒక విలాసవంతమైన వాహనాలను కొనుగోలు చేయొచ్చునట. దీన్ని బట్టి అజాతుర్ నెయిల్ పాలిష్ ధర ఎంత ఎక్కువో అర్థం చేసుకోవచ్చు.

ఈ నెయిల్ పాలిష్ ధర సామాన్యుడు తన జీవితాంతం సంపాదించినా కొనలేనిది. ఒక చిన్న బాటిల్ అజాతుర్ ధర సుమారు రూ. 2 కోట్లుగా ఉంటుంది. ఈ సీసాలో 150 మి.లీ నెయిల్ పాలిష్ మాత్రమే ఉంటుంది.

కోట్ల విలువ చేసే ఈ నెయిల్ పాలిష్ ప్రత్యేకత ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా. ఐజాతుర్ తయారీలో 267 క్యారెట్ల నల్ల వజ్రం ఉపయోగించి తయారు చేశారట. అందుకే దీని ధర ప్రపంచంలోనే అత్యంత ఖరీదు. ఇప్పటివరకు ప్రపంచంలో 25 మంది మాత్రమే ఈ నెయిల్ పాలిష్‌ను కొనుగోలుచేసినట్టు సమాచారం.




