Health Tips: వేసవిలో దొరికే ఈ పండ్లు రుచికే కాదు.. సంపూర్ణ ఆరోగ్యానికి సంజీవని

శ‌రీరంలో ఉన్న వేడి కూడా పోతుంది. ఇక ఈ పర్పుల్ కలర్‌ పండులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్, విటమిన్ సి, బి, గ్లూకోజ్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.

Health Tips: వేసవిలో దొరికే ఈ పండ్లు రుచికే కాదు.. సంపూర్ణ ఆరోగ్యానికి సంజీవని
Purple Fruit
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 21, 2023 | 12:58 PM

వేస‌వి కాలం వచ్చేసింది. ఈ సీజ‌న్‌లో మ‌నకు ఎక్క‌డ చూసినా చల్లటి తాటి ముంజలు, మామిడిపండ్లతో పాటుగా అల్లనేరేడు పండ్లు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ఎండాకాలంలో ఈ పండ్లు బాగా దొరుకుతాయి. అయితే ప్ర‌తి సీజ‌న్‌లోనూ మ‌నం ఆయా పండ్ల‌ను తిన్న‌ట్లే ఈ సీజ‌న్‌లోనూ అల్ల నేరేడు పండ్లను తినాలి. వీటితో మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. సాధార‌ణంగా ఈ పండ్లు తీపి, వ‌గ‌రు, పులుపు రుచులను కలిగి ఉంటాయి. ఇవి మ‌న‌కు వేడి నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి. ఆక‌లిని పెంచుతాయి. మ‌న శ‌రీరంలో క‌లిగే పైత్యాన్ని త‌గ్గిస్తాయి. విరేచ‌నాల స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అల్ల‌నేరేడు పండ్ల‌ను తినాలి. శ‌రీరంలో ఉన్న వేడి కూడా పోతుంది. ఇక ఈ పర్పుల్ కలర్‌ పండులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్, విటమిన్ సి, బి, గ్లూకోజ్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.

వికారం, విరేచనాలు, బహిష్టు సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడుతున్నవారు ఈ పండు తినడం వల్ల మూడు రోజుల పాటు బహిష్టు కడుపు నొప్పి నియంత్రణలో ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ సమస్యతో బాధపడుతుంటే అల్లననేరేడు పండ్లు తినడం వల్ల బ్లడ్ లెవెల్ పెరుగుతుంది. కారణం ఈ పండులో ఉండే ఐరన్‌. రక్త శుద్ధిలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండు జ్యూస్ ఆరోగ్యానికి అలాగే రుచికి మేలు చేస్తుంది. ఇది దగ్గు, గురకను నియంత్రిస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది.

ముఖ్యంగా ఎండాకాలంలో అల్లనేరేడు దాహాన్ని అరికడుతుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా ఈ పండ్లు నివారిస్తాయి. కడుపులో ప్రమాదవశాస్తు వెళ్లిన తలవెంట్రుకలు, లోహపు ముక్కలను సైతం కరిగిస్తాయి. చిగుళ్ల వ్యాధులతో బాధపడేవారు ఈ చెట్టు బెరడు ఆకుల రసాన్ని నోట్లో వేసుకుని పుక్కలిస్తే చాలా మంచిది. పుల్లలతో పళ్లు తోమితే చిగుళ్లు ఆరోగ్యాంగా ఉంటాయి. నోటి దుర్వాసనను నివారిస్తుంది. మూత్రాశయ, నోటి, క్యాన్సర్‌కు టానిక్‌లా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

నేరేడు గింజల్ని దోరగా వేయించి దంచి పొడి చేసుకుని నిలువ ఉంచుకోవాలి. ఈ పొడిని నీటిలో కలిపి కషాయం కాచి, అందులో పాలు, తాటి కలకండ కలిపి కాఫీలాగా రెండు పూటలా తాగితే అతి మూత్రం, మధుమేహం అదుపులోకి వస్తాయి. సీజనల్‌లో అల్లనేరేడు పండ్లను రోజుకు కనీసం 10 పండ్లు తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ..