Vastu Tips: అప్పుల బాధ భరించలేకపోతున్నారా? నిద్రపోయే ముందు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ 7 పనులు చేయండి..

కుటుంబ సంతోషం, శ్రేయస్సును కొనసాగించడంలో వాస్తు శాస్త్రం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. వాస్తు శాస్త్రం గృహ దోషాలను తొలగించడానికి, సంతోషకరమైన, సుసంపన్నమైన జీవితాన్ని నిర్మించడానికి వివిధ మార్గాలను చెబుతుంది.

Vastu Tips: అప్పుల బాధ భరించలేకపోతున్నారా? నిద్రపోయే ముందు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ 7 పనులు చేయండి..
Vastu
Follow us

|

Updated on: Mar 21, 2023 | 4:28 PM

కుటుంబ సంతోషం, శ్రేయస్సును కొనసాగించడంలో వాస్తు శాస్త్రం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. వాస్తు శాస్త్రం గృహ దోషాలను తొలగించడానికి, సంతోషకరమైన, సుసంపన్నమైన జీవితాన్ని నిర్మించడానికి వివిధ మార్గాలను చెబుతుంది. ఎవరైతే ఆర్థికంగా నష్టపోయారో..ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీ దేవి నివాసం ఉండదో…అలాంటివారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు వాస్తు శాస్త్రంలో ఎన్నో ఉపాయాలు ఉన్నాయి.

వాస్తు శాస్త్రంలో వివరించిన చిన్న చిన్న మార్గాల ద్వారా ఒకరి జీవితాన్ని ఆనందం, శాంతి, శ్రేయస్సుతో నింపవచ్చు. క్రమంగా సంపదకు మార్గం విస్తరిస్తుంది. దీని ప్రభావం వల్ల ఆ కుటుంబంలో లక్మీదేవి నివాసముంటుంది. ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు కొన్ని సాధారణ పనులను చేయాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీని ద్వారా వ్యక్తి జీవితంలో ప్రతికూల శక్తిని తొలగించవచ్చు. ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం.

పూజగదిలో దీపం వెలిగించండి:

ఇవి కూడా చదవండి

రాత్రి నిద్రపోయే ముందు పూజగదిలో నెయ్యి దీపం వెలిగించండి. ప్రతిరోజూ దీపం వెలిగిస్తే ఆ కుటుంబంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని నమ్మకం. ఇది ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవిని స్థిరంగా ఉంటుంది.

కర్పూరాన్ని కాల్చండి:

వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయే ముందు కర్పూరాన్ని కాల్చండి. బెడ్‌రూమ్‌తో పాటు గది మొత్తం మీద కర్పూరం పొగ వెళ్లేలా చూడండి. కర్పూరాన్ని కాల్చడం వల్ల ప్రతికూల శక్తి పోతుంది. లక్ష్మీదేవిని ప్రసన్నురాలవుతుంది.

రాత్రి పడుకునే ముందు ఆవనూనె దీపం వెలిగించండి:

దక్షిణ దిశలో దీపం వెలిగించండి. పూర్వీకులు నివసించేది ఇక్కడే. ఆవ దీపం వెలిగిస్తే, పూర్వీకులు సుఖసంతోషాలు, ఐశ్వర్యం ప్రసాదిస్తారు . రాత్రంతా దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే సాయంత్రానికి దీపం వెలిగించండి. అప్పుడు ఈ దిశలో చిన్న బల్బును వెలిగించండి.

ప్రవేశ ద్వారం శుభ్రంగా ఉంచండి:

వాస్తు శాస్త్రం ప్రకారం, రాత్రి పడుకునే ముందు ఇంటి ముఖద్వారాన్ని శుభ్రంగా ఉంచండి. ఇంటి ప్రవేశ ద్వారం నుండి చెప్పులు, బూట్లను తొలగించాలి . ఎందుకంటే లక్ష్మీదేవి ఈ ద్వారం నుండి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇంటి ప్రవేశ ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

ఇంటి మూలలను శుభ్రం చేయండి:

వాస్తు శాస్త్రంలో ఇంటిలోని ప్రతి మూలను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు . రాత్రిపూట ఇంటికి తూర్పు మూల, ఉత్తరం వైపు శుభ్రం చేయాలని నమ్ముతారు. గ్రంధాల ప్రకారం, కుబేరుడు ఈ కోనేరులో నివసిస్తాడని నమ్మకం.

మీ పాదాలను సరైన దిశలో ఉంచండి:

రాత్రి పడుకునేటప్పుడు మీ పాదాలు తలుపుకు ఎదురుగా ఉండకూడదు. తలుపు వైపు కాలు పెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం తొలగిపోతుందని నమ్ముతారు.

భగవంతుడిని స్మరించండి:

నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా భగవంతుని స్మరించుకోండి . ఆ తర్వాత ఎడమవైపుకు తిరిగి పడుకోవాలి. ఫలితంగా ఆరోగ్యం బాగుంటుంది.

(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..