Inspector Suspended: మహిళా ఇన్స్పెక్టర్ రాణి సస్పెండ్.. భారీగా అవినీతికి పాల్పడినట్లు గుర్తింపు

ఇన్స్పెక్టర్ రాణి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న తమిళనాడు పోలీస్ శాఖ దర్యాప్తుని సమగ్రంగా చేశారు. పోలీసు వాహనాన్ని నడపడం కోసం ప్రైవేట్ డ్రైవర్‌ను కూడా నియమించుకున్నట్లు గుర్తించారు. 

Inspector Suspended: మహిళా ఇన్స్పెక్టర్ రాణి సస్పెండ్.. భారీగా అవినీతికి పాల్పడినట్లు గుర్తింపు
Si Rani Suspended
Follow us
Surya Kala

|

Updated on: Mar 22, 2023 | 7:02 AM

చెన్నై కు చెందిన మహిళా ఇన్స్పెక్టర్ పై సస్పెండ్ వేటు పడింది. భారీగా అవినీతికి పాల్పడ్డ ఇన్స్పెక్టర్ రాణి ని సస్పెండ్ చేస్తూ తమిళనాడు పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డు ప్రమాదాల సమయం లో బాధితుల నుంచి లంచాల రూపం భారీగా నగదును లంచంగా తీసుకుంటుందని ఫిర్యాదు అందడంతో పోలీసు శాఖ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

ఉన్నతాధికారుల మెప్పు పొందుతూ.. తనపై వచ్చే ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది  ఇన్స్పెక్టర్ రాణి. ఇన్స్పెక్టర్ రాణి ఫై చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేయడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇన్స్పెక్టర్ రాణి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న తమిళనాడు పోలీస్ శాఖ దర్యాప్తుని సమగ్రంగా చేశారు. పోలీసు వాహనాన్ని నడపడం కోసం ప్రైవేట్ డ్రైవర్‌ను కూడా నియమించుకున్నట్లు గుర్తించారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రాణి ప్రైవేట్ డ్రైవర్‌తో అధికారిక వాహనంలో సంఘటనా స్థలానికి వెళుతుందని.. ఘటన స్థలానికి ఎంపిక చేసిన కొంతమంది న్యాయవాదులను కూడా పిలుస్తుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రమాద బాధితులతో బేరసారాలు సాగించి.. కమీషన్‌ ప్రాతిపదికన న్యాయవాదులకు కేసును అప్పగిస్తుందని.. ఫిర్యాదుదారులు తమ సొంత న్యాయవాదులను తీసుకురావడానికి వీలు లేదని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అంతేకాదు ప్రమాద సమయంలో వచ్చే బీమా సొమ్ము మంజూరైన తర్వాత కూడా రాణీ లంచం తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల విచారణలో ఎట్టకేలకు రాణి అవినీతి అక్రమాలు బయటపడ్డాయి. దీంతో తమిళనాడు పోలీసు శాఖ ఇన్స్పెక్టర్ రాణి ని సస్పండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..