Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hasanamba Temple: ఈ ఆలయంలో మిస్టరీలు సైన్స్‌కు సవాల్.. నైవేద్యం పాడవ్వదు, దీపం కొండెక్కదు.. కలియుగాంతానికి గుర్తు జరుగుతున్న రాయి..

ఈ దేవాలయానికి ఒకటి కాదు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి.ఈ ఆలయాన్ని సందర్శించి దైవానుగ్రహాన్ని పొందగలిగితే ప్రజలు అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ దేవాలయ భక్తులో మాజీ ప్రధానుల నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఈ దేవాలయం విశిష్టతలు ఏమిటి? తెలుసు కుందాం.. 

Hasanamba Temple: ఈ ఆలయంలో మిస్టరీలు సైన్స్‌కు సవాల్.. నైవేద్యం పాడవ్వదు, దీపం కొండెక్కదు.. కలియుగాంతానికి గుర్తు జరుగుతున్న రాయి..
Hasanamba Devi Temple
Follow us
Surya Kala

|

Updated on: Mar 21, 2023 | 9:34 AM

భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. కర్మ భూమిలో ప్రకృతి ప్రసాదిత పవిత్ర క్షేత్రాలు మాత్రమే కాదు.. మానవ నిర్మిత ఆలయాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత, సొంత చరిత్ర కలిగి ఉంటుంది. అలాంటి విశిష్ట దేవాలయాల్లో ఒకటి కర్ణాటకలో ఉన్న హాసనాంబ దేవాలయం. ఈ ఆలయానికి  తమ ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత ఉందని స్థానికులు చెబుతారు. హాసనాంబ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, దీపావళికి ఏడు రోజుల ముందు ఈ దేవాలయం తలపులను తీస్తారు. దీపావళి రోజున ఆయాలన్ని మూసివేస్తారు. ఆ సమయంలో.. అమ్మవారిని ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు .. మళ్లీ మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు సందర్శించవచ్చు.

హాసన్‌లో ఉన్న హాసనాంబ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు..  ఎలా నిర్మించారు అనేది ఇప్పటికీ స్పష్టమైన అధరాలు లేవు. స్థానికులు  ప్రజలు హాసనాంబ అమ్మవారిని పూజిస్తారు.

ఈ దేవాలయానికి ఒకటి కాదు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి.ఈ ఆలయాన్ని సందర్శించి దైవానుగ్రహాన్ని పొందగలిగితే ప్రజలు అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ దేవాలయ భక్తులో మాజీ ప్రధానుల నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఈ దేవాలయం విశిష్టతలు ఏమిటి? తెలుసు కుందాం..

ఇవి కూడా చదవండి

హాసనాంబ ఆలయం ప్రతి సంవత్సరం ఒక వారం మాత్రమే తెరిచి ఉంటుంది. హాసనాంబ అమ్మవారి ఆలయంలో ఏడాది మొత్తంలో వెలిగించిన దీపాలు, పూజించిన పువ్వులు, రెండు బస్తాల బియ్యం,  నీరు పెట్టి ఆలయ తలుపులు మూసివేస్తారు. ఆలయం తెరిచే వరకు అమ్మవారికి వీటిని నైవేద్యాలుగా భావిస్తారు. ఆలయంలో నెయ్యి దీపం కూడా వెలిగిస్తారు. ఈ నెయ్యి దీపం ఆలయం మూసి వేసినప్పటికీ తిరిగి తెరచే సమయంలో కూడా వెలుగుతూనే ఉంటుంది. పువ్వులు వాడిపోవు. దేవత ముందు పెట్టిన రెండు బస్తాల అన్న కూడా వేడిగా ఉండి.. తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ అన్నాన్ని భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు.  చెబుతారు.

పురాణాల ప్రకారం.. ఏడుగురు మాతృకలు .. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండి దేవతలు భూమిపై ప్రయాణిస్తున్నారు.. వారు హాసన్ అందానికి మంత్రముగ్ధులయ్యారు. హాసన్‌ను తమ ఇల్లుగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంద్రాణి, వారాహి, చాముండి దేవి గెరె హోండా లోని మూడు బావుల దగ్గర ఉండాలని నిర్ణయించుకున్నారు, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి లు ఆలయంలోని మూడు చీమల పుట్టలను తమ నివాసంగా చేసుకొన్నారు. బ్రహ్మి కెంచమ్మ హాస కోట లోను ఆశ్రయం పొందింది. హసనాంబ ఆలయం పేరు మీదుగా హాసన్ పట్టణం అని పేరు పెట్టారు.

అమ్మవారి పేరే హాసనాంబ.. హాస్యం అంటే నవ్వు అని అర్థం. ఇక్కడ దేవత ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది కనుక ఇక్కడ ఉన్న దేవతకు హాసనాంబ అన్న పేరు వచ్చిందని స్థానికుల కథనం. అంతే కాకుండా తన భక్తులను ఎవరైనా హింసిస్తే ఉగ్రరూపం దాల్చి వారి అంతు చూస్తుందని విశ్వాసం. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతారు. హాసనాంబ భక్తులను హాసనాంబ అత్తగారు హింసించేదని చెబుతారు. దీంతో తన అత్తగారిని బంగారాయిగా మారమని శపించిందట. అత్తగారి బండరాయి ఇప్పటికీ హాసనాంబ గర్భాలయంలో కనిపిస్తుంది. అంతేకాదు అంతేకాకుండా ప్రతి ఏడాది ఈ రాయి రూపంలో ఉన్న అత్త ఒక ఇంచు హాసనాంబ అమ్మవారి దగ్గరకు జరుగుతూ ఉంది.

ఇక్కడ నైవేద్యాలు ప్రెష్ గా ఉండడమే కాదు.. ఒక రాయి మరో రాయి వద్దకు ఎలా జరుగుతూ ఉందన్న విషయం ఇప్పటికే అనేకమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. కానీ ఎవరికీ సమాధానం  దొరకలేదు. అంతేకాదు అత్త రూపంలో ఉన్న రాయి హాసనాంబ అమ్మవారి వద్దకు చేరుతుందో అప్పుడు కలియుగాంతం అవుతుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..