Ugadi 2023: ఉగాది నుంచి గజకేసరి రాజయోగం.. ఈ మూడు రాశులకు సర్వత్రా విజయం .. అందులో మీరున్నారా..?

ఉగాది నుండి మీనరాశిలో బృహస్పతి, చంద్రుడి కలవనున్నారు. దీంతో కొన్ని రాశులకు గజకేసరి రాజయోగాన్ని కలిగిస్తుంది. మీనరాశిలో ఏర్పడనున్న ఈ గజకేసరి రాజయోగంతో మూడు రాశులవారు పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Ugadi 2023: ఉగాది నుంచి గజకేసరి రాజయోగం.. ఈ మూడు రాశులకు సర్వత్రా విజయం .. అందులో మీరున్నారా..?
Gajakesari Rajayogam
Follow us
Surya Kala

|

Updated on: Mar 20, 2023 | 11:15 AM

చైత్రమాసంలోని శుక్లపక్ష పాడ్యమినాడు రోజు ఉగాది పండుగగా జరుపుకుంటారు. ఈ రోజునుంచి తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండగను అత్యంత ఘనంగా జరుపుకోడానికి రెడీ అవుతున్నారు. ఈ ఏడాది మార్చి 22వ తేదీన ఉగాది వచ్చింది. ఉగాది నుంచి మనుషుల జీవితంలో సరికొత్త మార్పులు వస్తాయని.. 12 రాశులల్లో విభిన్నమైన మార్పులు వస్తాయని విశ్వాసం. అందుకనే పంచాంగ శ్రవణం ద్వారా తమ ఏడాదిలో రానున్న లాభనష్టాలను తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఉగాది పండగ నుంచి మూడు రాశులవారికి గజకేసరి యోగం లభించనున్నదట.

ఉగాది నుండి మీనరాశిలో బృహస్పతి, చంద్రుడి కలవనున్నారు. దీంతో కొన్ని రాశులకు గజకేసరి రాజయోగాన్ని కలిగిస్తుంది. మీనరాశిలో ఏర్పడనున్న ఈ గజకేసరి రాజయోగంతో మూడు రాశులవారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్ధికంగా అన్ని విధాలా లాభాలను అందుకుంటారు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ గజకేసరి రాజయోగం వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సులభంగా ఎదుర్కొంటారు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ రోజు గజకేశరి యోగ అంటే ఏమిటి? ఆ మూడు రాశులు ఏమిటో తెలుసుకుందాం..

గజకేసరి రాజయోగం:

ఇవి కూడా చదవండి

గజకేసరి అంటే అర్ధం ఏమిటంటే.. గజము అంటే ఏనుగు అని, కేసరి అంటే సింహము. ఏనుగు సింహం రెండూ మంచి బలమైన జంతువులు.. దీంతో ఈ గజకేశరి రాజయోగంతో ఆ ఆయా రాశులకు చెందిన వ్యక్తులు .. తమ తెలివి తేటలను.. ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తారని.. చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారని విశ్వాసం. అందుకే ఈ గజకేసరి రాజయోగం అంటే సకల శుభాలని ఇచ్చే రాజయోగం అని అంటారు.

సింహ రాశి: 

ఉగాది పండగ రోజునుంచి మీన రాశిలో ఏర్పడనున్న గజకేసరి రాజయోగంతో ఈ రాశి వ్యక్తులు తిరుగులేని జాతకులగా మారతారు. ఈ ఏడాది వీరికి శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలను అందుకుంటారు.  వృత్తి, విద్య వ్యాపారస్తులకు అన్నింటా లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులకు గజకేసరి యోగంతో ఆర్ధికంగా లాభాలను పొందుతారు.

మీన రాశి:

ఈ రాశివారికి ఈ యోగంతో విశేష శుభాలను పొందుతారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. విద్యారంగంలోని వారు విశేషమైన కీర్తి ప్రతిష్టలను పొందుతారు. అన్నింటా విజయాలను అందుకుంటారు. ఈ రాశి వ్యక్తులు ఏ పని మొదలు పెట్టినా సమయం అనుకూలిస్తుంది. అన్నీ కలిసి వస్తాయి.

మిథున రాశి:

ఈ రాశివారికి ఈ రాజయోగంతో అన్ని విధాలా కలిసొస్తుంది. ఈ రాశి వ్యక్తుల జాతకంలో దేవ గురు బృహస్పతి  ఉగాది నుంచి ఆధిపత్యం చెలాయించే స్థానంలో ఉంటాడు. ఈ రాశి వ్యక్తులు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ రంగంలోని వారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి