AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi: శ్రీశైలంలో మొదలైన ఉగాది ఉత్సవాలు.. మల్లన్న దర్శనం కోసం కన్నడ భక్తుల సాహస యాత్ర..

ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినానికి లక్షలాది మంది కన్నడ భక్తులు శ్రీశైల క్షేత్రానికి పాదయాత్ర చేస్తూ వస్తారు

Ugadi: శ్రీశైలంలో మొదలైన ఉగాది ఉత్సవాలు.. మల్లన్న దర్శనం కోసం కన్నడ భక్తుల సాహస యాత్ర..
Srisailam Ugadi
Surya Kala
|

Updated on: Mar 20, 2023 | 10:13 AM

Share

కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఉగాది సంబరాలు మొదలయ్యాయి. మహా శైవ క్షేత్రంలో ఉగాది మహోత్సవలు సందర్భంగా దేవాలయంసహా పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలంకరణతో ఎంతో దేదీప్యమానంగా, చూసేవారి కన్నులు మిరిమిట్లు గొలుపుతున్నాయి. మల్లన్న ఆలయంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

ఐదు రోజులు ఉగాది ఉత్సవాలు:

ఐదు రోజులపాటు జరగనున్న ఉగాది మహోత్సవాలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో  శ్రీకారం చుట్టారు. శ్రీశైలం మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవముల సందర్భంగా మొదటి రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకారంలో శ్రీ భ్రమరాంబా దేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆది దంపతులు భృంగి వాహనంపై ప్రత్యేక పూజలు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

మల్లన్న దర్శనం కోసం కన్నడ భక్తులు సాహస యాత్ర:

ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినానికి లక్షలాది మంది కన్నడ భక్తులు శ్రీశైల క్షేత్రానికి పాదయాత్ర చేస్తూ వస్తారు. కర్నాటకకు చెందిన భక్తులు ఇలా పాదయాత్ర చేస్తూ వచ్చి ఉగాది రోజున దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ పాదయాత్రలో భాగంగా కర్నాటక నుంచి శ్రీశైలానికి దాదాపు 680 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు. ఈ నేపథ్యంలో కొందరు కన్నడ భక్తులు కాళ్లకు కర్రలు కట్టుకుని వాటిపై నడుస్తూ.. శ్రీశైలానికి బయలుదేరారు. ఇది చూసిన స్థానికులు.. శ్రీశైల క్షేత్రం.. మల్లన్న మీద కన్నడిగులకు గల భక్తికి నిదర్శనం అని అంటున్నారు.

24 గంటల పాటు టోల్ ఓపెన్ 

ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని అటవీశాఖ టోల్ గేట్లను 24 గంటల పాటు వాహనాలకు అనుమతిస్తామని నంద్యాల జిల్లా అటవీశాఖ అధికారి అలెన్ చాలంగ్  టెరాన్ చెప్పారు. శ్రీశైలం ఉత్సవాలపై అయన మాట్లాడుతూ.. ఉగాది సందర్భంగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. అందువలన భక్తుల సౌకర్యార్ధం వాహనాలకు అనుమతినిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక ఉత్సవాల రోజుల్లో మాత్రమే ఇలా అనుమానిస్తామని చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..