Swapna Shastra: కలలో ఈ 5 విషయాలను చూడటం చాలా శుభప్రదం.. ఆ కలలు, వాటి అర్థం ఏమిటంటే?

కలలలో.. కొన్ని కలలు చాలా భయానకంగా ఉంటాయి. కొన్ని కలలు వ్యక్తికి నచ్చుతాయి. ఈ రోజు స్వప్న శాస్త్రంలో పేర్కొన్న శుభ కల గురించి తెలుసుకుందాం.

Swapna Shastra: కలలో ఈ 5 విషయాలను చూడటం చాలా శుభప్రదం.. ఆ కలలు, వాటి అర్థం ఏమిటంటే?
Swapna Sastram
Follow us
Surya Kala

|

Updated on: Mar 19, 2023 | 7:48 AM

ప్రతి ఒక్కరూ కలలు కంటారు. రాత్రి నిద్రలో ఒక వ్యక్తి వివిధ రకాల కలలను చూస్తాడు. వాటిలో కొన్ని శుభ,  అశుభకరమైన కలలుగా పరిగణించబడతాయి. ఈ కలలు మనిషి జీవితంలో తీవ్ర ప్రభావం చూపుతాయి. స్వప్న శాస్త్రంలో కలల గురించి వివరంగా వివరించబడ్డాయి. కలలో కనిపించే విషయాలు నిజ జీవితంలో వేరే అర్థాన్ని కలిగి ఉంటాయి. కలలు ఒక వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనల గురించి వివిధ సూచనలను ఇస్తాయి.

కలలలో.. కొన్ని కలలు చాలా భయానకంగా ఉంటాయి. కొన్ని కలలు వ్యక్తికి నచ్చుతాయి. ఈ రోజు స్వప్న శాస్త్రంలో పేర్కొన్న శుభ కల గురించి తెలుసుకుందాం. కొన్ని కలలో కొన్ని రూపాలు జీవితంలో కొన్ని శుభ సంఘటనలు జరగబోతున్నాయని సూచన అని అంటున్నారు.

మరణించినట్లు కల భయంకరమైన కలల్లో మరణం కల ఒకటి. కానీ స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో ఎవరి మరణాన్ని చూసినా శుభప్రదంగా భావిస్తారు. స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో మరణాన్ని చూసేవారికి.. త్వరలో ఆకస్మిక డబ్బు వస్తుంది. రానున్న రోజుల్లో వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

కలలో పండ్లు, పువ్వులు ఉన్న చెట్లను చూడటం చాలా సార్లు చాలా పండ్లు, పువ్వులతో నిండిన చెట్లు కలలలో కనిపిస్తాయి. అలాంటి కల ఒక శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. అటువంటి కల కనిపించడం రాబోయే రోజుల్లో కొన్ని శుభవార్తలను సూచిస్తుంది. అలాంటి కలలను చూడటం అంటే ఒక వ్యక్తి ప్రతి కోరిక త్వరలో నెరవేరుతుందని అర్థం. ఒక వ్యక్తి చాలా డబ్బును ఆర్జిస్తాడని స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు.

పర్వతారోహణ కల చాలా మంది వ్యక్తులు తమ కలలో పర్వతాలను అధిరోహించడం లేదా పర్వతాలు అధిరోహించినట్లు కలలు కంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం.. ఇటువంటి కలలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఇలాంటి కలకు అర్థం ఒక వ్యక్తి జీవితంలో పురోగతికి కొత్త మార్గాలు తెరవబోతున్నాయని అర్ధం. ఉద్యోగంలో ఉన్న వారికి పురోభివృద్ధి.. మంచి జీతం వచ్చే సూచనలు, వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయని అర్ధం.

కలలో గుడ్లగూబను చూడటం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో.. మీరు మీ కలలో గుడ్లగూబ  చూసినట్లయితే..  త్వరలో మీరు లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారని అర్థం చేసుకోండి. మీరు జీవితంలో సంపద, ఆనందం, శ్రేయస్సు పొందబోతున్నారని అర్ధం.

వర్షం గురించి కలలు కలలో వర్షాన్ని చూడటం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. మీ జీవితంలో అన్ని రకాల సంతోషాలు వస్తాయి అని అర్థం. మీరు సంపదకు లోటుగా భావించరు. మీ ప్రణాళికలు ఏవైనా మీకు గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ