AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: ఉదయం నిద్రలేవగానే పొరపాటున కూడా వీటిని చూడకండి.. చూస్తే దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లే..!

ఉదయం లేవగానే  కొన్ని రకాల వస్తువులను చూడడం కూడా ఇందుకు ప్రధాన కారణమని వాస్తు, జీవనశైలి నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆయా వస్తువులు,

Astro Tips: ఉదయం నిద్రలేవగానే పొరపాటున కూడా వీటిని చూడకండి.. చూస్తే దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లే..!
Early Morning Lifestyle Tips
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 18, 2023 | 3:55 PM

Share

మనలో చాలా మంది తమ రోజును చాలా ఉత్సాహంగా ప్రారంభించి, అదే రీతిలో ఆ రోజును గడపాలనుకుంటారు. అయితే చాలా సందర్భాలలో ఏవో అనుకోని ఘటనలు, ఆలోచనలు మన మనసును పాడు చేయడమే కాాక మన రోజును కూడా నాశనం చేస్తాయి. ఈ క్రమంలో ఉదయం లేవగానే  కొన్ని రకాల వస్తువులను చూడడం కూడా ఇందుకు ప్రధాన కారణమని వాస్తు, జీవనశైలి నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆయా వస్తువులు, లేదా పనులు మీద ఉన్న మన బాధ్యతలు మనసుకు విసుగు, విరక్తి తెప్పించగలవని వారు పేర్కొంటున్నారు. అందువల్ల ఉదయం లేవగానే ఆ వస్తువులు చూస్తే.. రోజంతా మంచిగా ఉండదని.. ఏ పని తలపెట్టిన జరగదని అంటున్నారు. అంతేకాక ఇవి మన మానసిక పరిస్థితిపై ప్రభావం చూపి, ప్రతివిషయంలో వెనకడుగు వేసేలా చేస్తాయంట. ఇంకా వీటి వల్ల దరిద్రాన్ని ఇంటికి ఆహ్వానించినట్లే అవుతుందని వాస్తు, జోతిష్య, జీవనశైలి నిపుణులు మాట. మరి ఈ క్రమంలో ఉదయం లేవగానే ఏయే వస్తువులను చూడకూడదో, ఏయే పనులు చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఉదయం లేచిన వెంటనే విరిగిన పాత్రలు, పనిచేయని గడియారం చూడడం మంచిది కాదు. ఉదయాన్నే వీటిని చూడడం వలన మీ రోజంతా సరిగ్గా పనిచేయదని వాస్తు నిపుణులు అంటున్నారు. అందువలన వీటిని ఇంట్లో పెట్టుకోకపోవడమే మంచిది.
  2. కొందరికి ఉదయం లేవగానే తమ ముఖాన్ని అద్దంలో చూసుకునే అలవాటు ఉంటుంది. అయితే అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. అలా చేస్తే ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయంట.
  3. అలాగే ఉదయాన్నే సూది, దారాలు, నూనె పాత్రలు చూడకూడదు. వీటిని అపశకునంగా భావిస్తారు.
  4. అంతేకాకుండా.. ఉదయం మీ నీడను కూడా చూసుకోవడం కూడా మంచిది కాదు. పడమటి దిశ నుంచి నీడను చూస్తే.. రాహు ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకవేళ ఆకస్మాత్తుగా నీడను చూస్తే.. తులసి ఆకులను తినాలి.
  5. ఉదయాన్నే రాత్రి వంట చేసిన వస్తువులను చూడకూడదు. ఒకవేళ చూస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
  6. ఈ క్రమంలనే కొంతమంది తమ ఇళ్లలో జంతువుల చిత్రాలను పెట్టుకుంటారు. అయితే  ఉదయం నిద్రలేవగానే వాటిని చూడకూడదు. ఒకవేళ వాటిని చూస్తే ఆ రోజంతా వివాదాలు, గందరగోళాలతో గడిచిపోతుందట. అందుకనే మీరు మీ గదిలో ఏ జంతువు చిత్రాన్ని ఉంచకపోవడమే మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

మరి ఏం చూడాలి..?: మీరు ఉదయం లేవగానే మీ అరచేతులను చూడాలి. ఎందుకంటే వ్యక్తి అదృష్టం వారి అర చేతుల్లోనే దాగి ఉంటుందట. అరచేతిలోకి చూస్తూ ‘కరాగ్రే వసతే లక్ష్మీ: కరమ్ధే సరస్వతి, కర్ములే తు గోవిందః ప్రభాతే కర్దర్శనం’ అని జపించి భగవంతుడిని మనసులో స్మరిస్తూ పూజించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..