Ugadi Pachadi: ఆరు రుచుల ఉగాది పచ్చడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, జీవత సూత్రాలు.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మన భావోద్వేగాలను కూడా తెలుపుతాయి. తీపి, చేదు లాగ కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని
మనలో చాలా మందికి తెలియని విషయమేమిటంటే ఉగాది పండుగే తెలుగు వారికి కొత్త సంవత్సరం. ఆ కారణంగానే ఉగాదిని చాలా గొప్పగా జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఉగాది అంటే అందరికీ ముందుగా గుర్తుచ్చోది షడ్రుచుల పచ్చడే. ఇది తీపి,పులపు, కారం, ఉప్పు, చేదు, వగరు వంటి ఆరు రుచులతో ఉండే ఈ పచ్చడి రుచి మాటల్లో వివరించలేనిదిగా ఉంటుంది. అయితే ఈ ఆరు రుచులు మన భావోద్వేగాలను కూడా తెలుపుతాయి. తీపి, చేదు లాగ కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి మనకు సందేశమిస్తుంది. ఇంకా ఉగాది నాడు చేసుకునే ఈ షడ్రుచుల పచ్చడికి ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనితో మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
తీపి: ఉగాది పచ్చడిలో తీపి కోసం కొత్తబెల్లాన్ని ఉపయోగిస్తారు. నిజానికి కొత్తబెల్లాన్ని తింటే మనకు ఆకలి కలగడమే కాక మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తీపిని ఇష్టపడని వారే ఉండరు కదా.. ఇంకా బెల్లం మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పిత్తం, వాతం సమస్యలను తగ్గిస్తుంది. కొత్త కణాలను ఏర్పరిచేందుకు సహాయపడుతుంది. చక్కెర బరువును పెంచుతుంది కానీ బెల్లం అలా కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలపై కూడా ప్రభావితం చేయదు.
పులుపు: ఉగాది పచ్చడిలో పులుపు కోసం చింతపండును ఉపయోగిస్తారు. పులుపు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింతపండుతో పచ్చడి రుచి అదిరిపోతుంది. ఈ పచ్చడిలోని పులుపు ఎలాంటి పరిస్థితులకైనా ఓర్పుగా ఉండాలని సూచిస్తుంది. చింతపండును తింటే కఫ వాతం పోతుంది. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ఎందుకంటే చింతపండును తింటే ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. ఇది మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కారం: కారం సహనాన్ని కోల్పోవడాన్ని సూచిస్తుంది. ఆరోగ్యం విషయానికి కొస్తే.. కారాన్ని మితంగా తీసుకుంటే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ఱక్రియకు సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఉండే క్రిములను చంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఉప్పు: ఉగాది పచ్చడిలోని రుచిని, భయాన్ని సూచిస్తుంది. అయితే ఉప్పు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది మన జీర్ణశక్తిని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకలిని కూడా కలిగిస్తుంది. కానీ ఉప్పును ఎక్కువగా తీసుకుంటే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా కలుగుతాయి. ఎందుకంటే ఉప్పును మోతాదుకు మించి తింటే గ్యాస్, ఎసిడిటీ, మూత్రపిండాల సమస్యలు వస్తాయి.
చేదు: ఉగాది పచ్చడిలో వేపపువ్వును కూడా ఉపయోగిస్తారు. ఈ రుచి మన బాధలకు సంకేతం. కానీ వేపపూత మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మన శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగిస్తుంది. బ్లడ్ ను శుద్ధి చేస్తుంది. అంతేకాదు వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా సహాయపడుతుంది.
వగరు: ఎండాకాలంలోనే మామిడి కాయలు పండుతాయి. అయితే వీటిని కూడా ఉగాది పచ్చడిలో వేస్తారు. మామిడి కాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి శరీరాన్ని బలంగా చేస్తాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీర మంటను కూడా తగ్గిస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..