Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 1st ODI: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం.. బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన కేఎల్ రాహుల్..

టెస్టుల్లో ఫెయిలై జట్టులో స్థానం కోల్పోయిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో 75 పరుగులతో తన సత్తా చాటాడు. అలాగే టీమిండియా ఆల్‌రౌండర్..

IND vs AUS 1st ODI: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం.. బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన కేఎల్ రాహుల్..
Ind Vs Aus 1st Odi
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 17, 2023 | 9:13 PM

భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసి 188 పరుగులకే ఆలౌట్ అయిన ఆసీస్ జట్టుపై 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మరోవైపు టెస్టుల్లో ఫెయిలై జట్టులో స్థానం కోల్పోయిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో అజేయంగా 75 పరుగులతో తన సత్తా చాటాడు. అలాగే టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా 45 పరుగులతో రాణించడంతో తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. అయితే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. కంగారులకు అడ్డుకట్ట వేయడంలో పైచేయి సాధించింది. అయితే ఈ క్రమంలో ఆసీస్ బ్యాటర్లలో మిషెల్ మార్ష్(81: 65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు), స్టీవ్ స్మిత్(22: 30 బంతుల్లో4 ఫోర్లు), జోష్ ఇంగ్లీస్(26: 27 బంతుల్లో1 ఫోర్, 1 సిక్సర్) రాణించారు. ఇక ఈ ముగ్గురు మినహా మరే ఆటగాడు ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. తొలి ఓవర్ నుంచే ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేస్తూ టీమిండియా బౌలర్లు తమదైన శైలిలో బౌలింగ్ ప్రదర్శన చేశారు. ఫలితంగా ఆసీస్ బ్యాటర్లు 188 పరుగులకే ఆలౌట్ అయ్యారు. మరోవైపు భారత్ బౌలర్లలో మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీసుకోగా.. జడేజా 2, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 189 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన టీమిండియా ఓపెనర్లు కూడా జట్టుకు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. ఇషాన్ కిషన్(3), విరాట్ కోహ్లీ(4) వంటి ప్లేయర్లు కూడా విఫలమవడంతో టీమిండియా 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోవలసి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్(0) కూడా నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేెఎల్ రాహుల్ క్రీజులో నిలదొక్కుకున్నాయి. అయితే ఒక దశలో నిలకడగా రాణిస్తున్న శుభమాన్ గిల్(20) కూడా 11 ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో.. 39 పరుగులకే నాలుగో వికెట్ కూడా టీమిండియా కోల్పోయింది. దీంతో అనంతరం వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి కేఎల్ రాహుల్ ఐదో వికెట్‌కు 44 పరుగులు భాగస్వామ్యం అందించారు. కానీ 83 పరుగుల వద్ద స్టోయినిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన హార్దిక్(25) బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చుకుని పెవిలియన్ చేరాడు.

ఇవి కూడా చదవండి

హార్దిక్ వికెట్ కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన సర్ జడేజా ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 108 పరుగుల అజేయమైన భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు.. 45 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించడంలో కూడా కీలకపాత్ర పోషించాడు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా అజేయంగా 75 పరుగుల చేసి.. తన వన్డే కెరీర్‌లో 13వ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. వన్డేల్లో ఐదో స్థానంలో 17 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన కెఎల్ రాహుల్, 7 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ చేయడం విశేషం. ఇక ఆసీస్ బౌలర్లలో మిచ్చెల్ స్టార్ 3, మార్కస్ స్టోయినీస్ 2 వికెట్లు తీసుకున్నారు.