6 ఓవర్లు.. 3 వికెట్లు.. మెరుపు బౌలింగ్‌తో 17 కోట్ల ప్లేయర్‌కూ మైండ్‌ బ్లాక్‌.. గాల్లో డ్యాన్స్‌ ఆడిన స్టంప్స్‌

సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో6 ఓవర్లు బౌలింగ్‌ చేసిన షమీ.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్‌లో రెండు మెయిడెన్లు ఉండడం గమనార్హం.

6 ఓవర్లు.. 3 వికెట్లు.. మెరుపు బౌలింగ్‌తో 17 కోట్ల ప్లేయర్‌కూ మైండ్‌ బ్లాక్‌.. గాల్లో డ్యాన్స్‌ ఆడిన స్టంప్స్‌
Ind Vs Aus 1st Odi
Follow us
Basha Shek

|

Updated on: Mar 17, 2023 | 7:33 PM

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య మొదటి గేమ్‌ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదటగా టాస్‌ గెలిచి టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. ఎప్పటిలాగే హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ వికెట్‌ తీసి శుభారంభం అందించాడు. అయితే మిచెల్‌ మార్ష్‌ (65 బంతుల్లో 81) దూకుడుగా ఆడాడు. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (22) తో కలిసి రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించాడు. అయితే ఎప్పుడైతే మార్ష్‌ ఔటయ్యాడో ఆసీస్‌ బ్యాటింగ్‌ ఒడిదుడుకులకు లోనైంది. ముఖ్యంగా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో6 ఓవర్లు బౌలింగ్‌ చేసిన షమీ.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్‌లో రెండు మెయిడెన్లు ఉండడం గమనార్హం. షమీ పడగొట్టిన 3 వికెట్లలో రెండు క్లీన్‌ బౌల్డ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్‌ను షమీ ఔట్‌ చేసిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌ అని చెప్పవచ్చు. 30 ఓవర్‌లో షమీ వేసిన ఫుల్లర్‌ లెంగ్త్‌ డెలివరీని సరిగ్గా అంచనా వేయలేక పోయాడు గ్రీన్‌. డిఫెన్స్‌ ఆడే ప్రయత్నంలో.. బంతి బ్యాట్‌కు మిస్‌ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. అంతకుముందు జోస్‌ ఇంగ్లిస్‌ను కూడా ఇలాగే పెవిలియన్‌కు పంపించాడు షమీ.

షమీ బౌలింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. షమీతో పాటు సిరాజ్‌ మూడు వికెట్లు పడగొట్టడంతో 35.4 ఓవర్లలోనే 188 పరుగులకు ఆలౌటౌంది ఆసీస్‌. జడేజా రెండు, కుల్దీప్‌, హార్దిక్‌, తలా వికెట్‌ సాధించారు. ఇక 189 పరుగులకు ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆదిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (3), గిల్‌ (20), విరాట్‌ కోహ్లీ (4), సూర్యకుమార్‌ యాదవ్‌ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. అయితే కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (25), వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ (31 నాటౌట్‌) పరిస్థితని చక్కదిద్దారు. కడపటి వార్తలందే సమయానికి భారత్‌ 24.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. రాహుల్‌కు తోడుగా జడేజా (10) క్రీజులో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..