Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 1st ODI: 188 పరుగులకే ఆసీస్ ఆలౌట్.. కంగారులకే కంగారు పుట్టించిన టీమిండియా బౌలర్లు..

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్ను తొలి వన్డేలో ఆసీస్ జట్టు 188 పరుగులకే కుప్పకూల్చింది. ముంబయిలోని వాంఖడే

IND vs AUS 1st ODI: 188 పరుగులకే ఆసీస్ ఆలౌట్.. కంగారులకే కంగారు పుట్టించిన టీమిండియా బౌలర్లు..
Ind Vs Aus 1st Odi
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 17, 2023 | 5:37 PM

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్ను తొలి వన్డేలో ఆసీస్ జట్టు 188 పరుగులకే కుప్పకూల్చింది. ముంబైలోని వాంఖడే వేదికగా శుక్రవారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతో.. ఆసీస్ టీమ్ బ్యాట్ పట్టి క్రీజులోకి వచ్చింది. రెండో ఓవర్ నుంచే వికెట్లు కోల్పోయిన కంగారులు.. భారత్ బౌలర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయారు. ఆసీస్ బ్యాటర్లలో మిషెల్ మార్ష్(81: 65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు), స్టీవ్ స్మిత్(22: 30 బంతుల్లో4 ఫోర్లు), జోష్ ఇంగ్లీస్(26: 27 బంతుల్లో1 ఫోర్, 1 సిక్సర్) మినహా మరే ఆటగాడు ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్ కంగారులకే కంగారు పుట్టించడంలో ముందున్నారు.

వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు రోహిత్ శర్మ దూరం కావడంతో.. ఈ మ్యాచ్‌లో జట్టును హార్దిక్ పాండ్యా నడిపిస్తున్నాడు. తొలుత టాస్ గెలిచిన హార్దిక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాట్‌తో క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా ఓపెనర్లలో.. ట్రావిస్ హెడ్ (5) ఆరంభంలోనే సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం వచ్చిన స్టీవ్‌స్మిత్ (22), మార్కస్ లబుషేన్ (15) కూడా మన బౌలర్లని ఎక్కువ సేపు ఎదుర్కొలేకపోయారు. అయితే ఓపెనర్‌గా వచ్చిన  మిచెల్ మార్ష్(81) వికెట్లు పడుతున్నా బెదరకుండా రాణించాడు. గాయం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా.. బంతిని భారీ సిక్సర్లుగా, బౌండరీలుగా మలిచాడు.

ఇవి కూడా చదవండి

కానీ స్కోర్ 129 అన్నప్పుడు మిచెల్ మార్ష్ తన వికెట్ కోల్పోవడంతో ఆసీస్ జట్టు తడబడటం ప్రారంభించింది. అనంతరం వచ్చినవారిలో కామెరూన్ గ్రీన్ (12), జోష్ ఇంగ్లీస్ (26), గ్లెన్ మాక్స్‌వెల్ (8), మార్కస్ స్టాయినిస్ (5), సీన్ అబాట్ (0), ఆడమ్ జంపా (0) క్రీజులో నిలబటలేక వికెట్లు చేజార్చుకున్నారు.  మిచెల్ స్టార్క్ (4*: 10 బంతుల్లో 1×4) నాటౌట్‌గా నిలిచాడు. కాగా గాయంతో ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ ఆడలేదు. ఈ క్రమంలో మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీసుకోగా.. జడేజా 2, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 189 పరుగుల టార్గెట్‌తో క్రీజులోకి వచ్చిన భారత్ ఓపెనర్లు కూడా రెండో ఓవర్లోనే తమ వికెట్‌ను కొల్పోయారు. రెండో ఓవర్ చివరి బంతి ఆడిన ఇషాన్ కిషన్ ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ప్రస్తుతం క్రీజులో శుభమాన్ గిల్(6), కోహ్లీ(0) ఉన్నారు.

జాబిల్లి ఈమె వద్ద వెన్నెలను అప్పుగా తీసుకుంది.. డేజ్లింగ్ మిర్న..
జాబిల్లి ఈమె వద్ద వెన్నెలను అప్పుగా తీసుకుంది.. డేజ్లింగ్ మిర్న..
నల్లగా ఉన్నాయని దూరం పెట్టకండి.. కలోంజితో కలిగే లాభాలు తెలిస్తే..
నల్లగా ఉన్నాయని దూరం పెట్టకండి.. కలోంజితో కలిగే లాభాలు తెలిస్తే..
బాక్సర్ కావాల్సిన అమ్మాయి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
బాక్సర్ కావాల్సిన అమ్మాయి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
సెలబ్రిటీ మేక.. ప్రపంచంలోనే ఇలాంటి జీవి మరొకటి లేదట!
సెలబ్రిటీ మేక.. ప్రపంచంలోనే ఇలాంటి జీవి మరొకటి లేదట!
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
ఈ జియో ప్లాన్‌లలో ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌..
ఈ జియో ప్లాన్‌లలో ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌..
పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా? ఆ ఒక్క తప్పుతో ..
పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా? ఆ ఒక్క తప్పుతో ..
ఏడుగురు అమ్మాయిలు.. 13 మంది అబ్బాయిలు.. ఫామ్‌ హౌస్‌లో అర్ధరాత్రి
ఏడుగురు అమ్మాయిలు.. 13 మంది అబ్బాయిలు.. ఫామ్‌ హౌస్‌లో అర్ధరాత్రి
రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్.. ఏంటో తెలుసా?
రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్.. ఏంటో తెలుసా?
విల్లు వంటి ఒంపు సొంపులతో వలపు బాణాలు సందింస్తున్న మాళవిక..
విల్లు వంటి ఒంపు సొంపులతో వలపు బాణాలు సందింస్తున్న మాళవిక..