Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM MITRA: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలో భారీ పరిశ్రమ ఏర్పాటు.. పూర్తి వివరాలివే..

తెలంగాణతో సహా పలు రాష్ట్రాలలో టెక్స్‌టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన..

PM MITRA: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలో భారీ పరిశ్రమ ఏర్పాటు.. పూర్తి వివరాలివే..
Pm Mitra Mega Textile Parks
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Ravi Kiran

Updated on: Mar 17, 2023 | 4:07 PM

తెలంగాణకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ మేరకు తెలంగాణతో సహా పలు రాష్ట్రాలలో టెక్స్‌టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇంకా ఈ పార్కుల ద్వారా టెక్స్‌టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తుందని, లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు.

“పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు 5F (ఫార్మ్ నుంచి ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ నుంచి ఫారిన్ వరకు) లక్ష్యదృష్టికి అనుగుణంగా టెక్స్‌టైల్స్ రంగాన్ని పెంచుతాయి. తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఎంపీ, యూపీలలో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు కానున్నాయని పంచుకోవడానికి సంతోషిస్తున్నాను. పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు టెక్స్‌టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించి కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తాయి. వాటితో పాటు లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తాయి. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘మేక్ ఫర్ ది వరల్డ్’కి గొప్ప ఉదాహరణ అవుతుంది. ప్రగతికాపిఎంమిత్ర’ అంటూ తన ట్వీట్‌ ద్వారా తెలియజేశారు.

అసలు ఏమిటీ ‘పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు’..?

కరోనా సమయంలో ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించాలని దేశంలోని యువతకు పిలుపినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆశయాన్ని సాకారం చేసేందుకు వేసిన ఆడుగులలో ఈ పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు కూడా ఒక భాగం. ప్రపంచ టెక్స్‌టైల్స్ రంగంలో భారతదేశాన్ని కూడా బలపరచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ 9ని సాధించడంలో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. ఎలా అంటే ‘స్థిరమైన మౌలిక సదుపాయాలను నిర్మించి, స్థిరమైన పారిశ్రామికీకరణను, ఆవిష్కరణలను ప్రోత్సహించడం’.

ఈ క్రమంలోనే వస్త్ర పరిశ్రమలోని చెయిన్ సిస్టమ్‌ కోసం సమగ్ర స్థాయిలో ఆధునిక పారిశ్రామిక మౌలిక సదుపాయాల సౌకర్యాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ పథకం పనిచేస్తుంది. ఇది లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడంతో పాటు ఇండియన్ టెక్స్‌టైల్స్‌ను ప్రపంచ స్థాయిలో మెరుగుపరుస్తుంది. ఇంకా ఈ పార్కులు మన దేశానికి పెట్టుబడులను ఆకర్షించడంలో, ఉపాధి కల్పనను పెంపొందించడంలో, గ్లోబల్ టెక్స్‌టైల్ మార్కెట్‌లో బలంగా నిలదొక్కుకోవడంలో సహాయపడుతుంది. ఈ పార్కులు టెక్స్‌టైల్ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి, ఆపై విజయవంతం కావడానికి అవసరమైన అనుసంధానాలను కలిగి ఉన్న ప్రదేశాలలో ఏర్పాటు కాబోతున్నాయి.

మరిన్ని తెలంగాణ  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..