LLC 2023: వరుస హాఫ్ సెంచరీలతో దూసుకెళ్తున్న గౌతమ్ గంభీర్.. వికెట్ పడకుండానే షాహిద్ ఆఫ్రిదీ సేనపై ఘన విజయం..

మంగళవారం ఇండియా మ‌హ‌రాజాస్, ఆసియా ల‌య‌న్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో కేవ‌లం 36 బాల్స్‌లోనే 12 ఫోర్ల‌తో గంభీర్ 61 ప‌రుగులు చేశాడు. మహారాజాస్‌కు సారథిగా..

LLC 2023: వరుస హాఫ్ సెంచరీలతో దూసుకెళ్తున్న గౌతమ్ గంభీర్.. వికెట్ పడకుండానే షాహిద్ ఆఫ్రిదీ సేనపై ఘన విజయం..
Gautam Gambhir; Als Vs Ims
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 15, 2023 | 8:22 PM

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో భాగంగా ఆసియా లయన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ ఓపెన‌ర్ గౌత‌మ్ గంభీర్ బ్యాటింగ్ మెరుపుల‌తో అద‌ర‌గొట్టాడు. అంతేకాక ఈ మ్యాచ్‌లో అర్థశతకం బాదిన గంభీర్.. లీగ్‌లో వ‌రుస‌గా మూడో హాఫ్ సెంచ‌రీ సాధించాడుజ. ఈ మూడు అర్థశతకాలతో ఆట‌కు దూర‌మైనా.. త‌న‌లో బ్యాటింగ్ ప‌వ‌ర్ ఇంకా తగ్గ‌లేద‌ని షాహిద్ అఫ్రిదీ సేనకు చాటిచెప్పాడు. మంగళవారం ఇండియా మ‌హ‌రాజాస్, ఆసియా ల‌య‌న్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో కేవ‌లం 36 బాల్స్‌లోనే 12 ఫోర్ల‌తో గంభీర్ 61 ప‌రుగులు చేశాడు. మహారాజాస్‌కు సారథిగా ఉన్న గంభీర్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించాడు. అత‌డితో పాటు రాబిన్ ఉత‌ప్ప(39 బాల్స్‌లో 5 సిక్స‌ర్లు, 11 ఫోర్ల‌తో 88 ప‌రుగులు) కూడా భీకరమైన బ్యాటింగ్‌తో ప‌ది వికెట్ల తేడాతో ఆసియా ల‌య‌న్స్‌ను చిత్తుచేసేందుకు సహకరించాడు.

కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా ల‌య‌న్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు న‌ష్ట‌పోయి 157 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు ఉప‌ల్ త‌రంగ (69 ర‌న్స్‌), దిల్షాన్ (32 ర‌న్స్‌)తో పాటు చివ‌ర‌లో అబ్ధుల్ ర‌జాక్ 27 ర‌న్స్‌తో రాణించారు. ఈ క్రమంలో ఇండియా మ‌హ‌రాజాస్ బౌల‌ర్ల‌లో రైనా రెండు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఉత‌ప్ప‌, గంభీర్ మెరుపుల‌తో 158 ప‌రుగుల టార్గెట్‌ను 12.3 ఓవ‌ర్ల‌లోనే చేధించి ఇండియా మ‌హరాజాస్‌కు విజయం సాధించి పెట్టారు. అలాగే అంతకముందు జరిగిన రెండు మ్యాచ్‌లలో కూడా గౌతమ్ గంభీర్ 54(39), 68(42) పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!