AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs AUS: ఆసీస్‌తో తొలి వన్డే.. టీమిండియాకు ఆ ఇద్దరే కీలకం.. ఇక భయం మొదలైందిగా..

టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవడమే తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది.

IND Vs AUS: ఆసీస్‌తో తొలి వన్డే.. టీమిండియాకు ఆ ఇద్దరే కీలకం.. ఇక భయం మొదలైందిగా..
Ind Vs Aus
Ravi Kiran
|

Updated on: Mar 15, 2023 | 8:22 PM

Share

టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవడమే తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ మార్చి 17 నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టిస్ సెక్షన్లు మొదలు పెట్టేశాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. టెస్టు సిరీస్‌లో ఆడిన టీమిండియా ఆటగాళ్లు సరాసరి వన్డే జట్టు ప్లేయింగ్ 11లోకి వచ్చేశారు. టీమిండియాలో ఈ ఇద్దరు ప్లేయర్స్.. మొదటి వన్డేలో కీలకం కానున్నారు. అందులో ఒకరు డబుల్ సెంచరీ హీరో. వారెవరో కాదు.. మహమ్మద్ సిరాజ్, శుభ్‌మాన్ గిల్.. ఈ ఇద్దరూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. వీరే ఆస్ట్రేలియాకు పెద్ద ముప్పు. ఈ ఇరువురూ ఇప్పటివరకు 21 వన్డేలు ఆడారు.

అహ్మదాబాద్ టెస్టులో అద్భుత సెంచరీ సాధించిన శుభ్‌మాన్ గిల్ వన్డే ఫార్మాట్‌లో మరింత ప్రమాదకరం. ఈ ఆటగాడు కేవలం 21 వన్డేల్లో 1254 పరుగులు చేశాడు. గిల్ వన్డే సగటు 73 కంటే ఎక్కువ. అదే సమయంలో, అతడి స్ట్రైక్ రేట్ కూడా 109.80గా ఉంది. గిల్ గత 7 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. 96.66 సగటుతో 580 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ 123.14. అలాగే ఒక డబుల్ సెంచరీ, శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అటు ODI ఫార్మాట్‌లో మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్.. 21 మ్యాచ్‌లలో 38 వికెట్లు పడగొట్టాడు. గత 8 మ్యాచ్‌ల్లో సిరాజ్ గణాంకాలు మరింత ప్రమాదకరం. ఈ సమయంలో ఏకంగా 20 వికెట్లు తీశాడు. భారత పిచ్‌లపై ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా సహాకారం లభించదు, కానీ ఈ ఆటగాడు పవర్‌ప్లేలోనే కాకుండా మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలో కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు.

Follow Us
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్