Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahu Shukra Yuti: ఒకే రాశిలో రాహుశుక్రులు.. ఆ 3 రాశులవారికి కష్టాలు.. మరెవరికి లాభం అంటే..?

శుక్ర, రాహు గ్రహాల కలయిక మేషరాశిలో జరగబోతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారు తమ శత్రువుల పట్ల..

Rahu Shukra Yuti: ఒకే రాశిలో రాహుశుక్రులు.. ఆ 3 రాశులవారికి కష్టాలు.. మరెవరికి లాభం అంటే..?
Rahu Shukra Yuti 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 17, 2023 | 4:31 PM

మన దేశంలో జ్యోతిష్యశాస్త్రం ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రాచూర్యంలో ఉంది. జ్యోతిష్యశాస్త్రం ద్వారా రానున్న కాలంలో జరగనున్న విషయాలను తెలుసుకోవచ్చని మన పూర్వీకులు నమ్మేవారు. ఇక ఈ జ్యోతిష్యశాస్త్రం అనేది కేవలం మన దేశంలోనే కాక ఇతర దేశాలలోని పలు రకాల సంస్కృతులలో కూడా భాగంగా ఉంది. ఇక ఈ జ్యోతిషశాస్త్రంలో గ్రహ సంచారాలు, గ్రహ సంయోగాలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. అయితే హోళీ తర్వాత శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. అప్పటికే అక్కడ రాహు సంచరిస్తున్న కారణంగా మేషరాశిలో శుక్రుడు-రాహువు కలయిక ఏర్పడింది. అయితే ఈ మేషరాశిలో శుక్రుడు-రాహువు సంయోగం వల్ల రాశిచక్రంలోని మూడు రాశులవారికి నష్టం కలిగించేదిగా.. అలాగే మరో 2 రాశులవారికి అపారమైన పురోగతిని కల్సించేదిగా ఉంది. మరి ఆ రాశులేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

శుక్ర-రాహు కలయిక ఈ 3 రాశులవారికి మంచిది కాదు

మేష రాశి: శుక్ర, రాహు గ్రహాల కలయిక మేషరాశిలో జరగబోతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారు తమ శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సమయం మేషరాశివారికి కష్టంగా నడుస్తోంది.

కన్య: శుక్ర, రాహువుల కలయిక కన్యారాశి వారికి కూడా మంచిది కాదు. ఈ రెండు గ్రహాల సంయోగ సమయంలో మేషరాశివారికి ఆరోగ్య సంబంధిత సమస్య తలెత్తవచ్చు. కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు దాంపత్య జీవితంలో గొడవలు రావచ్చు.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: శుక్ర, రాహువుల కలయిక కర్కాటక రాశి వారికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ప్రమోషన్ కోసం ఎదురుచూసే వారు మరింత కాల వేచి ఉండాల్సిన పరిస్థితిని కల్పిస్తుంది. ఆదాయంలో తగ్గుదల ఉండవచ్చు. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశివారికి ఈ సమయం అస్సలు కలిసిరాదు.

శుక్ర-రాహు కలయిక ఈ 2 రాశులకు చాలా మంచిది

మిథున రాశి: రాహువు-శుక్రుల సంయోగం మిథునరాశి వారి జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకువస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలుగా మారుతాయి. ఆర్థికంగా కూడా పురోగమిస్తారు.

మకర రాశి: మేషరాశిలో శుక్రుడు-రాహువు కలయిక మకర రాశి వారిపై శుభ ప్రభావం చూపుతుంది. ఈ రాశివారి కోరికలన్నీ శుక్ర-రాహు కలయిక సమయంలో నెరవేరుతాయి. ఆస్తిని కొనుగోలు చేస్తారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. ఉద్యోగుల కోసం ప్రయత్నించేవారికి కూడా ఈ సమయం బాగానే ఉంటుంది.

Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..