వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను తలకెత్తుకోవాల్సి వస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కొంతమేరకు చక్కబడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి, తోబుట్టువుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లలు చదువులో విజయాలు సాధిస్తారు.