AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Lasya: ‘నవ్వించావ్‌.. నన్ను భరిస్తూ కన్నీళ్లు తుడిచావ్‌.. లవ్యూ డియర్‌’.. స్టార్‌ యాంకర్‌ లాస్య ఎమోషనల్‌

గురువారం (మార్చి 16) లాస్య భర్త ముంజనాథ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా తన భర్తపై కురిపించిందీ స్టార్‌ యాంకర్‌. తన భర్తతో కలిసున్న బ్యూటిఫుల్‌ ఫొటోస్‌ను షేర్‌ చేస్తూ..

Anchor Lasya: 'నవ్వించావ్‌.. నన్ను భరిస్తూ కన్నీళ్లు తుడిచావ్‌.. లవ్యూ డియర్‌'.. స్టార్‌ యాంకర్‌ లాస్య ఎమోషనల్‌
Anchor Lasya
Basha Shek
|

Updated on: Mar 16, 2023 | 9:55 PM

Share

తన మాటల గారడీతో బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది లాస్య. కామెడీ పంచులు, జోక్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ముఖ్యంగా ఆమె ఏనుగు-చీమ జోక్స్‌కు నెట్టింట బాగా క్రేజ్‌ వచ్చింది. అలాగే యాంకర్‌ రవితో చేసిన షోలు బాగా ఆదరణ పొందాయి. ఇక బిగ్‌బాస్‌ రియాల్టీషోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. టీవీషోలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ అందాల తార. నిత్యం తన పర్సనల్‌, ప్రొఫెషనల్‌ విషయాలను పంచుకుంటుంది. అలాగే గ్లామరస్‌ ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకుంటుంది. ఇక తన సొంత యూట్యూబ్‌ ఛానెల్‌తో పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తోంది. . ఇదిలా ఉంటే గురువారం (మార్చి 16) లాస్య భర్త ముంజనాథ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా తన భర్తపై కురిపించిందీ స్టార్‌ యాంకర్‌. తన భర్తతో కలిసున్న బ్యూటిఫుల్‌ ఫొటోస్‌ను షేర్‌ చేస్తూ .. ‘హ్యాపీ బర్త్‌డే మై డియర్‌ మంజునాథ్‌.. నా భర్త గురించి నేను ఎంతో గర్వపడుతున్నా. పర్ఫెక్ట్ హస్బెండ్. నా పిచ్చితనాన్ని క్షమించే ఏకైన వ్యక్తివి నువ్వు. నన్ను నవ్వించావు. నన్ను భరిస్తూ కన్నీళ్లు తుడిచావు. నన్ను గట్టిగా హత్తుకున్నావు. నా సక్సెస్‌ను దగ్గరుండి చూశావు. నా వైఫల్యాలను చూశావు. ఎలాంటి సమయంలోనైనా నాకు అండగా నిలిచి బోలెడు ధైర్యాన్ని ఇచ్చావు. నన్ను ఎంతో బలంగా మార్చావు. నా సంతోషానికి కారణం నువ్వే. ఓ పర్‌పెక్ట్‌ హస్బెండ్‌కు భార్యగా గర్వపడుతున్నా. లవ్యూ’ అని తన భర్తపై ప్రేమను కురిపించింది లాస్య.

ప్రస్తుతం లాస్య పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా భర్తతో దిగిన ఫొటోలు ఫ్యాన్స్‌ను, ఫాలోవర్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా మంజునాథ్‌కు పుట్టిన రోజు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. వీరి వైవాహిక జీవితం విషయానికొస్తే.. 2017లో మంజునాథ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది లాస్య. వీరి ప్రేమకు ప్రతిరూపంగా 2019లో దక్ష్‌ అనే కుమారుడికి జన్మనిచ్చింది లాస్య. ఇక ఇటీవల హోలీ పండగ రోజున మరోసారి అమ్మగా ప్రమోషన్‌ పొందింది. మార్చి 8న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం