AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్కార్‌ విజేతలకు సీఎం స్టాలిన్‌ సత్కారం.. ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ మూవీ యూనిట్‌కు భారీ నజరానాతో పాటు..

ప్రపంచ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుని గెలుచుకున్న ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం బృందానికి తమిళనాడు సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. మొత్తం 91 మందికి తలా లక్ష రూపాయిల నగదు, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ఇంటిని కేటాయిస్తూ సీఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీచేశారు.

ఆస్కార్‌ విజేతలకు సీఎం స్టాలిన్‌ సత్కారం.. ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ మూవీ యూనిట్‌కు భారీ నజరానాతో పాటు..
Cm Mk Stalin
Basha Shek
|

Updated on: Mar 15, 2023 | 9:11 PM

Share

ప్రపంచ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుని గెలుచుకున్న ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం బృందానికి తమిళనాడు సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. మొత్తం 91 మందికి తలా లక్ష రూపాయిల నగదు, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ఇంటిని కేటాయిస్తూ సీఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీచేశారు. ఏనుగు రఘుని సంరక్షించి, షార్ట్ ఫిలింలో నటించిన బొమ్మన్, వల్లియమ్మాళ్ ని సత్కరించారు సీఎం స్టాలిన్. రెండు ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకను ప్రపంచవేదికపై రెపరెపలాడించింది ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం, తమిళనాడుకి చెందిన ద ఎలిఫెంట్స్‌ విస్పరర్స్‌ షార్ట్‌ ఫిల్మ్‌ బృందం. ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ద్వారా తమిళనాడు రాష్ట్రానికీ, ముదుమలై జంతువుల పరిరక్షణ కేంద్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడంతో పరిరక్షణ కేంద్రం లో పనిచేన్తున్న సిబ్బంది సహా చిత్ర బృందంలోని 91 మందికి తలా లక్ష రూపాయల నజరానా ప్రకటించారు ముఖ్యమంత్రి స్టాలిన్‌. తప్పిపోయిన ఏనుగు రఘుని రక్షించి..కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది ఓ కుటుంబం. నోరులేని ఏనుగుని కన్నబిడ్డకన్నా అమితంగా ప్రేమిస్తారు బొమ్మన్‌..వల్లియమ్మాళ్‌లు. ఏనుగు రఘు సైతం వారిపై అంతకు మించిన ప్రేమను కురిపిస్తుంది. అంతేకాదు బొమ్మన్‌..వల్లియమ్మాళ్‌ల మధ్య అనుబంధాన్ని పెళ్ళి వరకు వచ్చేందుకు కారణమౌతుంది ఏనుగు రఘు.

మాటలు రాకున్నా..భాష లేకున్నా..జంతువులకీ మనుషులకీ మధ్య శతాబ్దాలుగా పెనవేసుకున్న అనుబంధాన్ని అద్భుతంగా చిత్రీకరించారు ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ షార్ట్‌ఫిల్మ్‌లో. తమిళంలో నిర్మించిన ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుని సొంతం చేసుకొని యావత్‌ ప్రపంచ ప్రజల మన్ననలు అందుకుంది. ఇందులో భాగంగానే ది ఎలిఫెంట్ విస్పరర్స్ లో కనిపించిన ఎలిఫెంట్ కేర్ టేకర్ బొమ్మన్ అండ్ బెల్లి దంపతులకు.. తమిళనాడు సీఎం స్టాలిన్ 2 లక్షల బహుమతి అందజేశారు. అలాగే ఎలిఫెంట్ కేర్ క్యాంపు లో వర్క్ చేసే 91 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 1 లక్ష ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!