- Telugu News Photo Gallery Cinema photos Liger Actress Ananya Panday cousin sister Alanna Panday going to marry Ivor Maccray
Ananya Panday: లైగర్ హీరోయిన్ ఇంట పెళ్లి బాజాలు.. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్
లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనన్యా పాండే ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. అనన్య సోదరి అలన్నా పాండే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తాజాగా అలన్నా పాండే మెహందీ వేడుక గ్రాండ్‌గా జరిగింది. పలువురు బాలీవుడ్ తారల ఈ ఈవెంట్‌లో సందడి చేశారు.
Updated on: Mar 14, 2023 | 9:39 PM

లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనన్యా పాండే ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. అనన్య సోదరి అలన్నా పాండే పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

తాజాగా అలన్నా పాండే మెహందీ వేడుక గ్రాండ్‌గా జరిగింది. పలువురు బాలీవుడ్ తారల ఈ ఈవెంట్‌లో సందడి చేశారు.

ఈ వేడుకలో పింక్ కలర్ లెహెంగా, డీప్‌నెక్ బ్లౌజ్ ధరించి ఎంతో అందంగా కనిపించింది అనన్య. ఈ సందర్భంగా క్యూట్ స్మైల్‌తో ఆమె దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

చుంకీ పాండే సోదరుడు చిక్కి పాండే కుమార్తెనే అలన్నా. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ ఐవోర్ మెక్‌క్రేని వివాహం చేసుకోనుంది. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఇప్పటికే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు

అలానా పాండే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఆమె బాయ్‌ఫ్రెండ్ గురించి మాట్లాడితే అతను సినిమా దర్శకుడని తెలుస్తోంది.




