AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అండగా నిలబడ్డారు.. ఎవరూ చూడనప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు’.. బాలయ్య గురించి తారకరత్న సతీమణి ఇంకా ఏమన్నారంటే?

తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటి నుంచి బాలయ్య ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు. తన సినిమా షూటింగులను కూడా పక్కన పెట్టి ఆస్పత్రిలో కంటికి రెప్పలా తారకరత్న ఫ్యామిలీని చూసుకున్నాడు. మృత్యంజయ హోమం చేయడం మొదలు

'అండగా నిలబడ్డారు.. ఎవరూ చూడనప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు'.. బాలయ్య గురించి తారకరత్న సతీమణి ఇంకా ఏమన్నారంటే?
Taraka Ratna Family
Basha Shek
|

Updated on: Mar 14, 2023 | 2:52 PM

Share

నందమూరి తారకరత్న కన్నుమూసి సుమారు 20 రోజులకు పైగానే అవుతోంది. ఈ విశాదం నుంచి నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా కోలుకోలేదు. ఇప్పటికీ చాలామంది తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి, బిడ్డలు ఈ విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు. భర్తతో తనకున్న మధుర జ్ఞాపకాలు తల్చుకుంటూ కుమిలిపోతోంది. అప్పుడప్పుడు తన బాధను సోషల్‌ మీడియాలో కూడా షేర్‌ చేసుకుంటోంది. ఆ మధ్యన తారకరత్న చిన్న కర్మ, పెద్ద రోజున తారకరత్నను తలచుకుంటూ ఎమోషనల్ పోస్టులు షేర్‌ చేసింది అలేఖ్య. అలాగే వాలంటైన్స్‌డే రోజున తారకరత్న రాసిన ప్రేమలేఖ, తిరుమలలో ఫ్యామిలీతో కలిసి చివరిసారిగా దిగిన ఫొటోలను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఇంతటి బాధలోనూ ఉపశమనం ఏంటంటే ఆ కుటుంబానికి నందమూరి బాలకృష్ణ తోడుగా ఉండడం. తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటి నుంచి బాలయ్య ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు. తన సినిమా షూటింగులను కూడా పక్కన పెట్టి ఆస్పత్రిలో కంటికి రెప్పలా తారకరత్న ఫ్యామిలీని చూసుకున్నాడు. మృత్యంజయ హోమం చేయడం మొదలు తారకరత్నను బతికించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు బాలయ్య. కానీ దురదృష్టవశాత్తూ తారకరత్న కన్నుమూయడం ఆ కుటుంబాన్ని కన్నీటిపాలు చేసింది. ఆ తర్వాత కూడా అబ్బాయి చిన్నకర్మ, పెద్దకర్మ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నాడు బాలయ్య. ఈ క్రమంలో ఆపద వేళల్లో బాలకృష్ణ చేసిన సాయం, మద్దతును తల్చుకుంటూ భావోద్వేగానికి గురైంది అలేఖ్య. ఈమేరకు సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్టును షేర్‌ చేసింది.

నిన్ను చాలా మిస్‌ అవుతున్నాం..

‘మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి.. మంచి, చెడు ఏదైనా కానీ.. అవి పూర్తిగా సమసిపోయే వరకు రాయిలా మాకు అండగా నిలబడ్డ వ్యక్తి, ఆస్పత్రికి తీసుకువెళ్లే వేళ తండ్రిలా, నీ బెడ్‌ పక్కనే కూర్చొని నీ కోసం పాట పడినప్పుడు అమ్మలా, నిన్ను నవ్వించడం కోసం జోక్‌లు వేస్తూ.. సరదాగా కనిపించి.. ఎవరు చూడనప్పుడు నీ కోసం కన్నీరు పెట్టుకున్న మహానుభావుడు.. ఇలా అన్ని వేళలా ఆయన మన వెంటే ఉన్నారు. నీవు మరి కొంత కాలం మాతో ఉండి ఉంటే బాగుండేది ఓబు(తారకరత్న ముద్దుపేరు).. మేం నిన్ను చాలా మిస్‌ అవుతున్నాం. ఒరిజనల్‌ ఫొటోలో ఓబును మార్ఫింగ్‌ చేసిన వాళ్లుకు ధన్యవాదాలు. వారు చేసిన ఎడిటింగ్‌ ఎంతో అందంగా ఉంది. వారికి ధన్యవాదాలు’ అంటూ బాలయ్య తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేసింది అలేఖ్య. ఈ ఫొటోలో తారకరత్నను మార్ఫింగ్‌ చేసి యాడ్‌ చేశారు కొందరు నెటిజన్లు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ చూసిన అభిమానులు, నెటిజన్లు బాలకృష్ణ-తారకరత్న అనుబంధంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ధైర్యంగా ఉండండి మేడమ్‌.. బాలయ్య మీ ఫ్యామిలీకి తోడుగా, నీడగా ఉన్నారు. మీకు అంతా మంచే జరుగుతుంది. ఆనందంలో ఎవ్వరైనా తోడుంటారు.. కష్టాలు, కన్నీళ్లలో మన వెంట ఉన్నవారే నిజమైన బంధువులు.మా బాలయ్య మనసు బంగారం’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..