AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakeezah Vasuki: నటి పాకీజాను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మంచు విష్ణు.. ‘మా’ సౌకర్యాలు అందేలా సొంత డబ్బులతో..

మోహన్‌ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో బ్రహ్మనందంతో కలిసి పాకీజా చేసిన కామెడీ ఇప్పటికీ చాలామంది గుర్తుంటుంది. ఇదొక్కటే కాదు రౌడీ ఇన్స్పెక్టర్, పెదరాయుడు వంటి చిత్రాల్లోనూ తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందామె.

Pakeezah Vasuki: నటి పాకీజాను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మంచు విష్ణు.. 'మా' సౌకర్యాలు అందేలా సొంత డబ్బులతో..
Pakeezah Vasuki
Basha Shek
|

Updated on: Mar 16, 2023 | 7:59 PM

Share

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం లాంటిది. పగలు, రాత్రి ఉన్నట్లు ఇక్కడ కష్టాలు, సుఖాలు కామన్‌గా ఉంటాయి. అవకాశాలున్నప్పుడు స్టార్‌ స్టేటస్ అనుభవించిన సెలబ్రిటీలు ఛాన్సులు లేనప్పుడు దీన స్థితిలోకి వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. అలా సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నటి పాకీజా అలియాస్‌ వాసుకీ. మోహన్‌ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో బ్రహ్మనందంతో కలిసి పాకీజా చేసిన కామెడీ ఇప్పటికీ చాలామంది గుర్తుంటుంది. ఇదొక్కటే కాదు రౌడీ ఇన్స్పెక్టర్, పెదరాయుడు వంటి చిత్రాల్లోనూ తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందామె. ముఖ్యంగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, పాకీజా కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే తెలుగుతో పాటు తమిళ్ భాషల్లో కలిపి 150 సినిమాలు చేసిన పాకీజా సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె దీన స్థితిలో ఉంది. ఇటీవల ఓ ఛానెల్‌ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సాయంలో ముందుండే మెగా ఫ్యామిలీ ఆమెను సంప్రదించింది. మెగా బ్రదర్‌ నాగబాబు ఖర్చుల కోసం రూ. లక్ష అందించారు. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి కూడా రూ. 2లక్షల మేర ఆర్థిక సహాయం చేశారు. తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు పాకీజాకు సాయం చేసి మంచి మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

‘పాకీజా గారి పరిస్థితి చూసి ఆవిడ మా అసోసియేషన్ కార్డ్‌కి తన సొంత డబ్బులు కడుతున్న మంచు విష్ణు ఇప్పుడు ఆవిడకి అవసరం. థాంక్యూ బాబు.. నా మాట పోల్లుపోలేదు’ అంటూ పోస్ట్ పెట్టింది కరాటే కల్యాణి. కాగా పాకీజా కష్టాల్లో ఉందని తెలుసుకున్న మోహన్ బాబు.. స్వయంగా ఆమెతో ఫోన్ లో మాట్లాడారట. తాను అమెరికాలో ఉన్నానని ఇండియా రాగానే సాయం చేస్తానని మాట కూడా ఇచ్చారట. ఇందులో భాగంగానే మంచు విష్ణు తన సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డ్ పాకీజాకి అందించారట. కాగా మా అసోసియేషన్ కార్డుకు గతంలో రూ. లక్ష రూపాయలు ఉండేది. కానీ ప్రస్తుతం దానిని రూ. 90 వేలకు తగ్గించారు. వీకే నరేష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 90 వేలకు తగ్గించాడు. ఇప్పుడు ఈ అసోసియేషన్ కు కట్టాల్సిన 90 వేల రూపాయలను మంచు విష్ణు చెల్లించి, ఆమెకు కార్డు ఇస్తాడు అని కరాటే కల్యాణి చెప్పుకొచ్చింది. తద్వారా మా అసోసియేషన్ ద్వారా లభించే అన్ని సౌకర్యాలు పాకీజా కుటుంబానికి అందుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

Follow Us
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్