Telugu News » Photo gallery » 5 Foods For Healthy Teeth And Gums such as Fish To Fruits check out full details in Telugu
Dentalcare: ఆ సమస్యలకు చెక్ పెట్టాడానికి తీనాల్సిన ఆహారాలివే.. తింటే ఉపశమనమే కాక సంరక్షణ కూడా..
శివలీల గోపి తుల్వా |
Updated on: Mar 17, 2023 | 6:53 PM
మనలో చాలా మందికి దంతచిగుళ్ళు, దవడలలో వాపు వంటి దంత సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. అయితే దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్లు, మినరల్స్ వంటి కొన్ని రకాల పోషకాలు చాలా అవసరం. అందువల్ల పోషకాలతో కూడిన సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో దంత సమస్యలన్నింటి నుంచి ఉపశమనం పొందడానికి, మీ ఆహారంలో కొన్ని అదనపు ఆహారాలను చేర్చడం ద్వారానే సాధ్యమవుతుంది. ఇంకా వాటితో దంతాలకు మేలు కూడా జరుగుతుంది. మరి దంత సంరక్షణలో మనకు ఉపయోగపడే ఆహారాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Mar 17, 2023 | 6:53 PM
1. పాలు, మజ్జిగ, వెన్నె: చికాగో విశ్వవిద్యాలయం ప్రకారం దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఇంకా బలంగా ఉంచడానికి కాల్షియం, ప్రోటీన్లు చాలా అవసరం. ఇందు కోసం మీ ఆహారంలో చీజ్, పాలు, మజ్జిగను పుష్కలంగా చేర్చుకోండి. జున్నులో ఫాస్ఫేట్ ఉంటుంది, ఇది దంతాల pH వాల్యూను సమతుల్యంగా ఉంచుతుంది. ఇంకా నోటిలో లాలాజల ఉత్పత్తికి కూడా ఫాస్ఫేట్ అవసరం. మజ్జిగలోని ప్రోబయోటిక్ నోటిలోని ఆమ్ల స్థాయిని తగ్గిస్తుంది, చిగుళ్ళు, దంతాల కోతను నివారిస్తుంది.
1 / 5
2. నీరు: మన శరీరం దాదాపు 60 శాతం నీటితో నిర్మితమై ఉంది. కాబట్టి ప్రతి అవయవానికి నీరు చాలా అవసరం. ఫ్లోరైడ్ కలిపిన నీటిని తాగితే అది రెట్టింపు ప్రయోజనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా దంతాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఫ్లోరైడ్ కలిపిన నీరు దంతాల కుహరంలో పేరుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది.
2 / 5
3. పండ్లు: తాజా పండ్లు దంతాలు, చిగుళ్ళ సంరక్షణకు ఉత్తమ ఎంపిక. పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చిగుళ్ళను బ్యాక్టీరియా దాడి నుంచి రక్షించడమే కాక చిగుళ్ల కణజాలం దెబ్బతినకుండా నిరోధిస్తాయి.
3 / 5
4. నట్స్: డ్రై ఫ్రూట్‌లలో ఒకటైన బాదం పళ్లకు చాలా మంచిది. నట్స్‌లో కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, థయామిన్, మెగ్నీషియం, నియాసిన్, విటమిన్ ఇ, విటమిన్ బి6 వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ దంత క్షయం, బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. చిగుళ్లకు, వ్యాధినిరోధక శక్తికి అత్యంత ప్రయోజనకరమైన విటమిన్ డి బాదంలో కూడా ఉంటుంది.
4 / 5
5. చేపలు: ఆయిల్ ఫిష్‌లో దంతాల బలానికి ముఖ్యమైన అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. ఇది నోటిలో ఎక్కువ లాలాజలం ఉత్పత్తి కావడానికి కూడా సహాయపడుతుంది. దీని కారణంగా దంతాలు శుభ్రం చేయబడతాయి.