ChatGPT-4: AI ట్యూటర్‌ సేవలందిస్తున్న GPT-4.. ఇక వారి ఉద్యోగాలు రిస్క్‌లో పడినట్లేనా..?

ఓపెన్ ఏఐ మనుషుల మాదిరిగానే చాలా సృజనాత్మకంగా, ధీటైన జవాబులను ఇచ్చే చాట్‌జీపీటీ 4ను లాంచ్ చేసిన..

ChatGPT-4: AI ట్యూటర్‌ సేవలందిస్తున్న GPT-4.. ఇక వారి ఉద్యోగాలు రిస్క్‌లో పడినట్లేనా..?
Gpt 4 Ai Tutor
Follow us

|

Updated on: Mar 17, 2023 | 7:33 PM

ఖాన్ అకాడమీ సంస్థ గురించి మీరు ఇది వరకే విని ఉంటారు. ఎటువంటి లాభార్జన లేకుండా ఉచితంగా మాథ్స్, సైన్స్, హిస్టరీ, కంప్యూటింగ్ వంటి అనేక కోర్సులను అందిస్తున్న ఈ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ పనిచేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా విద్యార్థుల క్లాసులను మరింత ఈజీగా అర్థం చేసుకునేందుకు కొత్త AI(ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజన్స్) ట్యూటర్‌ను పరిచయం చేసింది. GPT-4 ఆధారంగా పనిచేస్తున్న ఈ ఏఐ ట్యూటర్‌ను Khanmigo అని పిలుస్తున్నారు. అయితే ఇటీవలికాలంలో ఓపెన్ ఏఐ (Open AI) మనుషుల మాదిరిగానే చాలా స‌ృజనాత్మకంగా, ధీటైన జవాబులను ఇచ్చే చాట్‌జీపీటీ 4 (GPT4)ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీనిని ఇప్పుడు ఖాన్‌ అకాడమీ ట్యూటర్‌గా ఉపయోగిస్తుంది. విద్యార్థులకు వారి చదువులో భాగంగా ఏవైనా డౌట్స్ ఉంటే దీని ద్వారా క్షణాల్లో నివృత్తి చేసుకోవచ్చు. ఇది క్లాస్‌రూమ్ అసిస్టెంట్‌గా కూడా పని చేస్తుంది. అయితే

AI ట్యూటర్ ప్రయోజనాలివే:

అన్ని క్లాసుల, వయసుల విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్, హ్యుమానిటీస్ వంటి వివిధ సబ్జెక్ట్స్‌లో ఉచితంగా ఖాన్ అకాడమీ అందిస్తుంది . అయితే, ప్రతి విద్యార్థికి ఆయా సబ్జెక్టులలోని అంశాలకు సంబంధించి ప్రత్యేకమైన ప్రశ్నలు, విభిన్న రీతిలో రావచ్చు. ఆ క్రమంలోనే కొన్ని కొన్ని సందర్భాలలో వారి ప్రశ్నలు, అనుమానాలను పూర్తిస్థాయిలో తీర్చే వీడియోలు ఖాన్ అకాడమీ ప్లాట్‌ఫామ్‌లో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు విద్యార్థులు కొన్ని కొన్ని అంశాలు, విషయాలను సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈ సమస్యలతో ఏ విద్యార్థి వెనుకపడకుండా వారి ప్రశ్నలకు సమర్ధవంతమైన సమాధానాలు ఇచ్చేలా ఖాన్ అకాడమీ AI-బేస్డ్ వర్చువల్ ట్యూటర్‌ ఖాన్మిగో(Khanmigo)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ట్యూటర్ విద్యార్థులు సబ్జెక్టుకు సంబంధించి అడిగే ఏ ప్రశ్నకైనా అద్దిరిపోయే ఆన్సర్ ఇస్తుంది. దీనివల్ల విద్యార్థులు డౌట్స్ తీర్చుకోవడానికి ఎక్కువసేపు వీడియోలు వెతకాల్సిన అవసరం ఉండదు. కేవలం కొన్ని సెకన్లలోనే వారి అనుమానాలు తీరుతాయి. ఖాన్ అకాడమీ AI ట్యూటర్‌తో విద్యార్థులు మెరుగ్గా టాపిక్స్ నేర్చుకోవచ్చు. ఇంకా ఉపాధ్యాయులు కూడా తమ సమయాన్ని చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ఉపాధ్యాయులకు AI-గైడెడ్ పాఠాలకు యాక్సెస్‌ కూడా ఉంటుంది. అలానే వారు విద్యార్థుల ప్రోగ్రెస్‌పై ఫీడ్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

Khanmigo అందించే ఇంటరాక్టివ్ ఎక్స్‌పీరియన్స్, రియల్-టైమ్ ఫీడ్‌బ్యాక్‌తో విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ స్కిల్స్ మెరుగుపరచుకోవచ్చు. Khanmigo విద్యార్థులకు కొత్త మార్గాల్లో రాసేలా, చర్చించేలా, సహకరించేలా ఎంకరేజ్ చేస్తుంది. అంతేకాదు ఆ మార్గాలలో తగిన సూచనలను కూడా అందిస్తుంది. అవసరమైనప్పుడు త్వరగా ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ రూపొందించడానికి కూడా ఉపాధ్యాయులు GPT-4ని ఉపయోగించవచ్చు. GPT-4 మనుషులతో సమానంగా పని చేయగలదు. ఇది అపారమైన జ్ఞానం, అధునాతన సామర్థ్యాలతో మెరుగైన, కచ్చితత్వంతో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలదు. ఖాన్ అకాడమీ రాబోయే కొన్ని సంవత్సరాలలో తమ ప్లాట్‌ఫామ్‌లో మరికొన్ని ట్యూటర్ లాంటి ఫీచర్‌లను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఇక్కడ నేర్చుకునే విద్యార్థులు సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో పట్టు సాధించగలుగుతారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ త్వరగా సమస్యలను పరిష్కరింవచ్చు. అయితే ఇవి నిజమైన టీచర్లను భర్తీ చేయలేవు. కానీ ఇవి విద్యార్థులకు వరం కంటే ఎక్కువే.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..