Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ChatGPT4: ఉద్యోగులకు అలెర్ట్.. ఆ 20 జాబ్స్‌కి ఎసరు పెడతానంటున్న ChatGPT లేటెస్ట్ వెర్షన్.. లిస్ట్ ఇదే..

AI ప్లాట్‌ఫారమ్ చెయ్యలేని పనిలేదని ఇది చాలా మంది ఉద్యోగాలకు రీప్లేస్ కావచ్చని కూడా చెబుతుంది ఓపెన్ఏఐ. అందుకే..

ChatGPT4: ఉద్యోగులకు అలెర్ట్.. ఆ 20 జాబ్స్‌కి ఎసరు పెడతానంటున్న ChatGPT లేటెస్ట్ వెర్షన్.. లిస్ట్ ఇదే..
Chatgpt4 May Replace these 20 Jobs
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 17, 2023 | 8:16 PM

ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇంటరాక్టివ్ టూల్ OpenAI ChatGPT లేటెస్ట్ వెర్షన్ కూడా వచ్చేసింది. ఈ కొత్త వెర్షన్ వస్తూనే మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈసారి వచ్చిన కొత్త వెర్షన్ ChatGPT4 మరింత ఆక్యురేట్ ఉంటుందని, ఇది చాలా రకాల ఉద్యోగాలకు రీప్లేస్ కావచ్చని కూడా నెట్టింట పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ AI ప్లాట్‌ఫారమ్ చెయ్యలేని పనిలేదని ఇది చాలా మంది ఉద్యోగాలకు రీప్లేస్ కావచ్చని కూడా చెబుతుంది ఓపెన్ఏఐ. అందుకే, దీని పైన వ్యాపార దిగ్గజాలు ఏమనుకుంటున్నాయో తెలుసుకునేందుకు resumebuilder.com ఒక సర్వే నిర్వహించగా అందులో మెజారిటీ ChatGPT కి అనకూలంగా ఉన్నట్లు తేలింది. అంతేకాదు, ChatGPT4 రీప్లేస్ చెయ్యగలిగిన జాబ్స్ ఏవని ChatGPTని అడిగితే, అది వెంటనే 20 జాబ్స్ లిస్ట్‌ను అందించింది.

అయితే ఈ లిస్ట్‌లో ట్రాన్స్‌లేటర్, కంటెంట్ రైటర్, డాటా ఎంట్రీ క్లర్క్ వంటి పలు ఉద్యోగాలు ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన 20 జాబ్స్ లిస్ట్‌ను  ప్రముఖ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ రోవన్ చియుంగ్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇక దీనిపై నెటిజన్లు విభిన్నరీతిలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఆ 20 జాబ్స్ లిస్ట్‌ ఏమిటో మీరు తెలుసుకోరా..? ఆ లిస్ట్ మీ కోసం..

ఇవి కూడా చదవండి

ChatGPT4 రీప్లేస్ చెయ్యగలిగిన 20 జాబ్స్ లిస్ట్..

  • Customer service representative
  • Content writer
  • Translator
  • Data entry clerk
  • Social media manager
  • Virtual assistant
  • Technical support specialist
  • Copy editor
  • Personal assistant
  • speechwriter
  • Blogger
  • Research analyst
  • Proof reader
  • Creative writer
  • Travel agent
  • Sales associate
  • Legal researcher
  • Human resources specialist
  • Marketing analyst
  • Call centre representative

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..