Virat Kohli Naatu Naatu: మైదానంలోనే ‘నాటు నాటు’ స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

తాజాగా టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ కూడా నాటు నాటు పాటకు తన కాలు కదిపాడు. అవును, మైదానంలో ఎంతో ఉత్సాహంగా, దూకుడుగా ఉండే కోహ్లీ..

Virat Kohli Naatu Naatu: మైదానంలోనే ‘నాటు నాటు’ స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Virat Kohli Naatu Naatu
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 17, 2023 | 10:08 PM

రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటుకు రోజురోజుకీ క్రేజ్ పెరుగుతోంది. గతేడాది రిలీజై ఇటీవలే అస్కార్స్ అవార్డు పొందిన ఈ పాటకు ఆకర్షణ కానీ ఆదరణ కానీ ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో ఎందరో నటులు, క్రీడాకారులు, ప్రముఖులు ఈ పాటకు స్టెప్పులేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే తాజాగా టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ కూడా నాటు నాటు పాటకు తన కాలు కదిపాడు. అవును, మైదానంలో ఎంతో ఉత్సాహంగా, దూకుడుగా ఉండే కోహ్లీ శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో.. ఫీల్డింగ్ చేస్తూ నాటు నాటు స్టెప్పులేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకా దీనిపై అటు ఆర్ఆర్ఆర్ సినిమా అభిమానులు, క్రీడాభిమానులు, ఇటు నెటిజన్లు లైకులు, కామెంట్లు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు.

శుక్రవారం టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకోవడంతో ఆసీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఈ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ అటు మైదానంలోని ఆటగాళ్లను, ఇటు క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచేందుకు నాటు నాటు పాటకు స్టెప్పులేశాడు. ఇక కోహ్లీ వేసిన స్టెప్పుల వీడియో ఆర్ఆర్ఆర్ సినిమా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయింది. ఇక ఇటివలే ముగిసిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇద్దరూ కలిసి పఠాన్ మూవీ టైటిల్ ట్రాక్‌పై స్టెప్పేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

కోహ్లీ నాటు నాటు స్టెప్పులను ఇక్కడ చూడండి.. 

View this post on Instagram

A post shared by RRR Movie (@rrrmovie)

ఇదిలా ఉండగా, ఈ రోజు జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు 189 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాటర్లు 5 వికెట్ల తేడాతో కంగారులపై విజయం సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 75 పరుగులతో అజేయంగా తన వన్డే కెరీర్‌లో 13వ హాఫ్ సెంచరీ చేయగా, రవీంద్ర జడేజా కూడా 45 పరుగులతో అజేయంగా రాణించాడు. అలాగే టీమిండియా బౌలర్లలో మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్ చెరో 3 వికట్లు, జడేజా 2, కుల్దీప్ యాదవ్ 1, హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీసుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..