AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మీరు చేసే ఈ చిన్న తప్పులు లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమవుతాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..

ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించి అనేక కీలక వివరాలు చెప్పారు. ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలంటే ఏం చేయాలి? ఉన్నతంగా జీవించాలంటే ఏం పాటించాలి?

Chanakya Niti: మీరు చేసే ఈ చిన్న తప్పులు లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమవుతాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..
Chanakya Neeti
Shiva Prajapati
|

Updated on: Mar 18, 2023 | 12:14 PM

Share

ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించి అనేక కీలక వివరాలు చెప్పారు. ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలంటే ఏం చేయాలి? ఉన్నతంగా జీవించాలంటే ఏం పాటించాలి? జీవితంలో నాశనం అవ్వాలంటే ఏం చేయాలి? ఇలా ప్రతి అంశాన్ని తాను రాసిన నీతిశాస్త్రం గ్రంధంలో చాణక్యుడు వివరించారు. అదే సమయంలో ధనవంతులు కావాలనుకుంటే ఏం చేయాలి? ఏం చేయకూడదో కూడా వివరించారు ఆచార్య. ఒక వ్యక్తి చేసే చిన్న తప్పిదాలు.. సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని తెప్పిస్తాయని, తద్వారా ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు చాణక్య. సమయానికి, డబ్బుకు విలువ ఇచ్చే వారినే విజయం వరిస్తుందని చాణక్యుడు పేర్కొన్నారు. లక్ష్య సాధనలో అజాగ్రత్త, దుబారా ఖర్చు చేసేవారిపట్ల లక్ష్మీ దేవి ఆగ్రహంగా ఉంటుందని, తద్వారా వారు ఆర్థికంగా చతికిలపడిపోతారని పేర్కొన్నారు.

మరి ఎలాంటి తప్పులు లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణం అవుతాయి? ఏం చేయకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం..

1. డబ్బును సక్రమంగా వినియోగించాలి. అహంకారం, కోపంతో డబ్బును ఉపయోగించే వారి జీవితం చిన్నాభిన్నం అవుతుంది. ఇలాంటి వారి పట్ల లక్ష్మీదేవి ఆగ్రహంగా ఉంటుంది.

2. చాణక్యుడి ప్రకారం.. డబ్బు సంపాదించాలనే కోరికతో ఇతరులకు హాని తలపెట్టేవారిపట్ల లక్ష్మీదేవి ఆగ్రహంగా ఉంటుంది. వారు చేసే అనైతిక పనులపై ఆగ్రహంతో.. లక్ష్మీదేవి వారిచెంత నుంచి వెళ్లిపోతుంది.

ఇవి కూడా చదవండి

3. డబ్బు రాగానే అహంకారం ప్రదర్శించేవారిపైనా లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఇలాంటి వారి వద్ద ఎక్కువ కాలం డబ్బు నిలవదు.

4. లక్ష్మీ దేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. పరిశుభ్రత పాటించని ప్రదేశంలో లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడదు. అలాంటి ప్రదేశం నుంచి అమ్మవారు తరలివెళ్లిపోతారు. తద్వారా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.

5. స్త్రీలను అవమానించే, పెద్దలను గౌరవించని ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ నివసించదు. అలాంటి వాకి ఎంత ప్రతిభ, సామర్థ్యాలు ఉన్నా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..