AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagananna Vidya Deevena: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తల్లుల ఖాతాల్లోకి నేడు నగదు జమ..!

పేద విద్యార్థుల ఉన్నత విద్యకు సహకారం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఏటా అందిస్తున్న జగనన్న విద్యా దీవెన.. నాల్గో విడత నగదు రేపు అనగా

Jagananna Vidya Deevena: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తల్లుల ఖాతాల్లోకి నేడు నగదు జమ..!
Jagananna Vidya Deevena
శివలీల గోపి తుల్వా
| Edited By: Sanjay Kasula|

Updated on: Mar 19, 2023 | 7:40 AM

Share

విద్యార్ధులకు వైయస్ జగన్ ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు సహకారం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా అందిస్తున్న జగనన్న విద్యా దీవెన.. నాల్గో విడత నగదు రేపు అనగా ఆదివారం తల్లుల ఖాతాలో జమ కానున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్.. అక్కడ జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి జేవీడీకి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమచేయనున్నారు. వాస్తవానికి శనివారమే తల్లుల ఖాతాలో ఈ నగదు జమ కావల్సిఉంది. అయితే తిరువూరులోని ముఖ్యమంత్రి సభా వేదికకు పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతోన్నందున.. కార్యక్రమాన్ని అదివారానికి వాయిదా వేశారు.

అయితే ఈ విషయంపై శనివారం మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్..‘రేపు తిరువూరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉంటుంది. జగనన్న విద్యాదీవెన నాల్గో విడత కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. గతకాలంలో పేదవిద్యార్థులకు ఉన్నత చదువు భారంగా మారింది. ప్రభుత్వ విద్యను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల బలోపేతం చేసే దిశగా పనిచేశారు. కానీ, వైఎస్‌ జగన్ సీఎం అయిన తర్వాత చదువుల్లో విప్లవం తెచ్చారు. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. చంద్రబాబు కేవలం 16 లక్షలు మందికి ఫీజులరీయింబర్స్ మెంట్ ఇచ్చారు. వైఎస్ జగన్ ఈ మూడేళ్లలో 31.4 లక్షల మందికి జగనన్న విద్యాదీవెన చేరువ చేశారు. రేపు 11 లక్షల మందికి 700 కోట్ల రూపాయలు అందించనున్నారు. చదువు ద్వారానే అన్నీ సాధ్యమని నమ్మిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. అందుకే విద్యకు పెద్దపీట వేశార’ని వెల్లడించారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. ‘విద్యాదీవెన కార్యక్రమాన్ని సీఎం జగన్ రేపు తిరువూరులో ప్రారంభిస్తారు. పేదలు సైతం కార్పొరేట్ స్కూల్స్‌లో చదవాలనేది సీఎం ఆలోచన. సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం చదువులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చార’ని తెలిపారు. అలాగే మాజీ సీఎం చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నా న్యాయం మా వైపు ఉందన్నారు. ఈ క్రమంలోనే 700 కోట్లు రేపు నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో వేయనున్నారని వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి తరహాలో ఎవరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడ ప్రభుత్వ స్కూల్స్ ను చూసి ఆశ్చర్యపోతున్నాయని తెలిపారు. ఏపీ తరహాలో తమ రాష్ట్రాల్లోని స్కూల్స్‌ను తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్నాయని తెలిపారు ఉదయభాను.

ఇవి కూడా చదవండి

ఆపై వైసీపీ  ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 2841 కోట్లు బడ్జెట్ లో విద్యకు కేటాయించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దే అని ప్రశంసలు కురిపించారు. అక్షర క్రమంలోనే కాదు విద్యలోనూ ఏపీ టాప్‌లో ఉండాలనేది సీఎం ఆలోచనని అందుకే విద్యపై స్పెషల్ ఫోకస్ పెట్టారని అన్నారు. ఈ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ అంటే వైఎస్సార్ గుర్తుకొస్తారని.. తండ్రిబాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు.ఇంకా  గడిచిన మూడేళ్లలో విద్య మీద 53 వేల కోట్లను సీఎం జగన్ ప్రభుత్వం ఖర్చు చేశారని తెలిపారు మల్లాది విష్ణు.