- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti even after success person should never show off these 5 things in life in telugu
Chanakya Niti: పదిమందిలో ఈ విషయాలను ప్రదర్శించడం మీ వైఫల్యానికి కారణం అన్న చాణక్య
ఆచార్య చాణక్యుడి కొన్ని విధానాలు నిజ జీవితంలో అనుసరించడం చాలా కష్టం. అయితే జీవితంలో సరైన మార్గంలో నడవాలని లేదా త్వరగా విజయం సాధించాలని కోరుకునే వారు చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను తప్పక పాటించాలి.
Updated on: Mar 16, 2023 | 11:24 AM


ఆచార్య చాణక్యుడు ప్రకారం జీవితంలో ఎప్పుడూ నటించకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. ఎంత పెద్ద సక్సెస్ సాధించినా గర్వం చూపించవద్దు. కాలం కలిసి రాకపోతే..ఓడలు బండ్లు కావడానికి టైం పట్టదు. ఆచార్య చాణక్యుడు చాణక్య విధానంలో నాలుగు విషయాల విషయంలో సిగ్గు పడవద్దు అని .. కొన్ని విషయాలను పదిమంది ముందు ప్రదర్శించవద్దని సలహా ఇచ్చాడు. ఆ 4 విషయాలు ఏంటో తెలుసుకుందాం.

ఆధునిక కాలంలో నేటి యువత తమ వృద్ధ తల్లిదండ్రుల గురించి తరచుగా సిగ్గుపడుతున్నారు. కాలక్రమేణా.. ప్రతి ఒక్కరి శరీరంలో వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా ఇదొక రోజు వృద్ధులు అవుతారు. అందుకే మీ పేరెంట్స్‌ని చూసి సిగ్గుపడడం కానీ.. వారిని మార్చుకోవాలని కానీ ఎప్పుడూ ప్రయత్నించకండి. తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించండి.

చాణక్యుడు ప్రకారం మూర్ఖులు, ద్రోహులను గౌరవించే చోట లక్ష్మీదేవి నివసించదు. మూర్ఖుల మాటలు వినేవాడు జీవితంలో ఎప్పుడూ నష్టపోవాల్సి వస్తుందని చాణక్యుడు నమ్మాడు. మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని విశ్వసించండి.

చాలా మంది వ్యక్తులు.. ఎటువంటి పెద్ద పని మొదలు పెట్టినా.. దానికి సంబందించిన హ్యూహాన్ని ముందుగా సిద్ధం చెయ్యరు. దీని కారణంగా వారు వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. చాణక్యుడు ప్రకారం.. వ్యూహంతో చేసిన పని చాలా వరకు విజయవంతమవుతుంది. ఇలాంటి పనుల్లో సమస్యలు, అడ్డంకులు కూడా తక్కువగా వస్తాయి.. విజయం త్వరగా సాధిస్తారు.

ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవులకు సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించాడు. అలాగే వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి చెప్పాడు. చాణక్యుడు ప్రకారం తనకు తెలియకుండానే వ్యక్తి చేసే తప్పులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనిషి పాటించాల్సిన కొన్ని విషయాలను చెప్పాడు.





























