Chanakya Niti: కొందరు ఎంత సన్నిహితులైనా సమయం వస్తే శత్రువులే అంటున్న చాణక్య
ఆచార్య చాణక్యుడు ప్రకారం.. కొన్నిసార్లు కొందరు వ్యక్తులు తమ కుటుంబ సభ్యులకు శత్రువులుగా మారతారు. వారు మిమ్మల్ని కేవలం భారంగా భావిస్తారు. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు తన రచనలలో ప్రతి వ్యక్తికి సంబంధించినవిగా భావించే అనేక విషయాలను ప్రస్తావించాడు. స్నేహితులు, బంధువులు లేదా తల్లిదండ్రులకు ఇలా మానవులకు సంబంధించిన అనేక విధానాలను చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. మీకు కొందరు ఎంత సన్నిహితంగా ఉన్నా, సమయం వచ్చినప్పుడు.. వారు మిమ్మల్ని వదిలి.. మీకు శత్రువులుగా మారతారు.
- ఎంత కుటుంబ సభ్యులైనా సరే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తల్లి, కొడుకు, భార్య, తండ్రి మొదలైన వారు మీకు శత్రువులుగా మారతారని చాణక్యుడు చెప్పాడు. అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా కొడుకుపై భారం వేసే తండ్రి నిత్యం పిల్లలకు ఇబ్బందిగా మారతాడని.. అతడిని ద్వేషిస్తూ ఉంటారని చెప్పాడు.
- తల్లి తన బిడ్డల మధ్య ఎప్పుడూ విభేదించదు అని అంటారు. అయితే తన బిడ్డలతో వాదిస్తూ.. విబేదించే తల్లిని పిల్లలకు శత్రువులుగా భావిస్తారు. అంతే కాకుండా భర్తతో కాకుండా వేరొకరితో సంబంధం పెట్టుకున్న స్త్రీ కూడా తన పిల్లలకు శత్రువుగా మారుతుంది.
- మీ భార్య చాలా అందంగా ఉంటే కొన్నిసార్లు అది కూడా ఇబ్బందులకు కారణం అవుతుంది. అటువంటి పరిస్థితిలో.. భార్య భర్తల మధ్య బంధం కూడా సురక్షితంగా ఉంచడం పెద్ద సవాలుగా మారుతుంది. భార్యతో పోల్చితే భర్త అందంగా లేకుంటే, ఇద్దరి మధ్య ఈ వ్యత్యాసం కూడా మనస్పర్థలకు కారణం అవుతుంది.
- మానసికంగా అస్వస్థతకు గురైన పిల్లలు, కొంతమంది తల్లిదండ్రులకు, అలాంటి పిల్లలు తల్లిదండ్రులకు జీవితాంతం మోయాల్సిన భారంగా భావిస్తారు. వారికి ఇది ఒక రకమైన శాపం. వారు అలాంటి పిల్లవాడిని కొందరు తల్లిదండ్రులు తమకు ఏ జన్మలోనో పిల్లాడు శత్రువు అన్నట్లు చూస్తారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)