Success Mantra: మనిషిలో ఈ లక్షణం ఉన్న వ్యక్తి జీవితం వెలుగు నిండి ఉంటుంది.. దయ గొప్పతనం ఏమిటంటే

ఇతరుల ఉన్నతిని కూడా దయ ఉన్న వ్యక్తి ఆనందంగా స్వీకరిస్తాడు. ధనవంతుడని, ఇతరులను చూసి అసూయపడకుండా..  ఇతరుల సంతోషాన్ని చూసి తాను సంతోషంగా ఉంటాడు. అందరిపై దయ, ప్రేమను కురిపించే వ్యక్తికి..

Success Mantra: మనిషిలో ఈ లక్షణం ఉన్న వ్యక్తి జీవితం వెలుగు నిండి ఉంటుంది.. దయ గొప్పతనం ఏమిటంటే
Motivational Quotes
Follow us
Surya Kala

|

Updated on: Mar 14, 2023 | 9:56 AM

దయ అనేది దైవిక గుణం. మనిషిలో దయ గురించి హిందూ సనాతన ధర్మంలో మాత్రమే కాదు అన్ని మతాలు బోధిస్తున్నాయి.  ఒక వ్యక్తిలో ఈ లక్షణం అభివృద్ధి చెందడం ప్రారంభించిన వెంటనే.. అతను గొప్ప వ్యక్తిగా మారడం ప్రారంభిస్తాడని నమ్మకం. దయ ఉన్నచోట మతం ఉంటుందని విశ్వాసం. విలువల అన్నిట్లో దయ గొప్పది. మీ ప్రవర్తన మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. దయ కలిగి ఉండడం వల్ల వచ్చిన జ్ఞాపకాన్ని కాలం కూడా చెరపలేదు. దయ అందం అది. ఒక వ్యక్తిలో ఉన్న దైవత్వాన్ని బయటకు తీసుకు వస్తుంది. మనిషిలో స్వయంచాలకంగా దయ వృద్ధి చెందడం.. మానవుడి సహజ లక్షణం.

ఇతరుల ఉన్నతిని కూడా దయ ఉన్న వ్యక్తి ఆనందంగా స్వీకరిస్తాడు. ధనవంతుడని, ఇతరులను చూసి అసూయపడకుండా..  ఇతరుల సంతోషాన్ని చూసి తాను సంతోషంగా ఉంటాడు. అందరిపై దయ, ప్రేమను కురిపించే వ్యక్తికి.. ఖజానాలో ఉంచిన డబ్బు కంటే గొప్పవాడని సాధువులు-మహా పురుషులు చెబుతారు. ఎందుకంటే దయ అనేది ఎవరి నుంచి ఏ దొంగ దొంగిలించలేని లక్షణాలు. జీవితంలో దయ అంటే అర్థం చేసుకోవడానికి విజయ మంత్రాలను గురించి తెలుసుకుందాం..

  1. దయ అనేది భగవంతుడి నుండి రెండు-మార్గాల ద్వారా లభించిన బహుమతి. దయ కలిగి ఉన్న వ్యక్తి  .. దయ కురిపించే వ్యక్తి కూడా  గొప్పవాడే..
  2. ధనవంతులుగా ఉండటం కంటే ప్రజలతో మర్యాదగా ఉండటం..  కొంచెం దయ చూపడం చాలా మంచిది ఎందుకంటే ఈ దయ సమాజాన్ని ఒకదానితో ఒకటి కలుపుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ఒక చెట్టు తీపి పండ్ల భారం ఇవ్వడం ద్వారా ఎలా గుర్తింపుని సొంతం చేసుకుంటుందో.. అదే విధంగా మనిషి తన మంచి పనుల ద్వారా గుర్తించబడతాడు.   మీ వినయం, దయ మీకు గొప్ప గుర్తింపును ఇస్తుంది.
  5. వేలాది మంది ప్రజల ప్రార్థన కంటే మనిషి చూపించే దయ గొప్పది.
  6. దుష్టుల ఇంటికి కూడా సూర్యచంద్రులు ఎలా వెలుగునిస్తారో.. అదే విధంగా సత్పురుషులు సద్గుణాలు లేని వారి పట్ల కూడా దయ,  కరుణ చూపించే వారు గొప్ప వ్యక్తులవుతారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)