Holi in Menar: ఈ గ్రామంలో హొలీ వేడుకలు భిన్నం.. తుపాకీ కాల్పులు, కత్తులతో వేడుకలు.. 500 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం..

హొలీ అంటే రంగుల కేళీ అని అందరికీ తెలిసిందే.. రంగులు, రంగు నీరు, బెలూన్లు, గుడ్లు వంటి వాటితో హొలీ జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఉత్తరప్రదేశ్ లో ఒక ప్రాంతంలో తేళ్లతో హొలీ ఆడుకోగా.. ఓ చిన్న గ్రామంలో మాత్రం తుపాకీల మోతతో హోలీని జరుపుకుంది. హొలీ ఇలా జరుపుకోవడానికి కారణం పురాణం కాదు..  ధైర్య చరిత్ర.. సాహసోపేతమైన విజయానికి గుర్తు.. 

Surya Kala

|

Updated on: Mar 10, 2023 | 9:28 AM

భారతదేశంలోని అన్ని  ప్రాంతాల్లో రంగులతో హోలీని జరుపుకుంటే.. రాజస్థాన్‌ ఉదయ్‌పుర్‌ జిల్లాలోని మెనార్‌ గ్రామంలో హోలీ వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. హొలీ వేడుకల కోసం రంగులను కాకుండా గన్స్ ను వినియోగించారు. వేడుకల్లో భాగంగా పురుషులు తుపాకుల్లో గన్ పౌడర్ ను నింపి గాలిలోకి కాల్పులు జరిపారు.  చేతిలో కత్తి , కర్రను పట్టుకుని 'గైర్' నృత్యం చేశారు. మహిళలు వీరత్వం, పరాక్రమం పాటలు పాడతారు. 

1 / 7
మెనార్ లో బ్రాహ్మణ జనాభా అధికం. ఇక్కడ హోలీని విభిన్నంగా జరుపుకుంటుంది. ఈ వేడుకల్లో భాగంగా తుపాకుల్లో గన్‌పౌడర్‌ను నింపి గాల్లోకి కాల్పులు జరుపుతారు. భారీ బాణసంచా కాలుస్తారు. ఈ విధంగా హోలీని జరుపుకోవడం వెనుక ఓ చారిత్రక కారణం ఉందని చెబుతున్నారు స్థానికులు. 

2 / 7
మెనార్ లో ఏటా హోలీ తర్వాతి రోజున దీన్ని నిర్వహిస్తారు.  ఈ వేడుకల కోసం సుదూర ప్రాంతాల నుండి ప్రేక్షకులు వస్తారు. కొన్ని శతాబ్దాల క్రితం మొఘల్ సైన్యంపై పోరాడి గెలిచిన విజయానికి గుర్తుగా బ్రాహ్మణులు 'బరూడోన్-కి-హోలీ' ఆడుకుంటారు.

3 / 7
సుమారు 500 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నామని చెబుతున్నారు. హొలీ మర్నాడు ప్రధాన ఓంకారేశ్వర కూడలిని దీపాలతో అలంకరించారు. రోజంతా, డ్రమ్మర్ డోలును కొడుతూనే ఉన్నారు. మధ్యాహ్నం, 1 గంట ప్రాంతంలో, మేవార్ రాజులు గ్రామానికి సమర్పించిన రెడ్ కార్పెట్ చౌరస్తాలో శాశ్వత వేదిక వద్ద ఏర్పాటు చేశారు. 52 గ్రామాల ప్రతినిధులు రాజస్థాన్ సంప్రదాయ దుస్తులను ధరించి, పండుగను ఘనంగా నిర్వహిస్తారు. 

4 / 7
మొఘల్ సైన్యానికి వ్యతిరేకంగా మెనార్ గ్రామానికి చెందిన కొంతమంది యువ యోధులు సమీపంలోని ఆయుధాలు తీసుకుని..మెరుపు గెరిల్లా దాడి చేశారు. మొఘల్ సైన్యాన్ని ఓడించారు.  ఆ చారిత్రాత్మక సంఘటన జ్ఞాపకార్థం ఈ పండుగ జరుపుకుంటారు. గ్రామంలోని ఓంకారేశ్వర్ కూడలిలో జరిగిన సమావేశంలో ఈ దాడికి ప్లాన్ చేశారు. ఇది 17వ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో, మేవార్ రాణా ప్రతాప్ మరణించిన తర్వాత.. అతని కుమారుడు అమర్ సింగ్ పాలకుడిగా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.

5 / 7
మెనార్ ప్రజలకు సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన రోజు.. ఇంకా చెప్పాలంటే దీపావళి పండుగ కంటే చాలా ముఖ్యమైనది. ఇండ్లు అందంగా అలంకరిస్తారు. ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. దేశ విదేశాల్లో ఉన్న 52 గ్రామాల యువకులు ఈ పండగకు తప్పని సరిగా ఈ పండగ జరుపుకోవడానికి వస్తారు. దాదాపు 10-15 వేల మేనరియాలు జమ్రాబీజ్ రాత్రికి ఇక్కడికి చేరుకుంటారు.

6 / 7
పురుషులు రాజపుత్ర వస్త్రధారణలో కుంకుమ, ఎరుపు తలపాగాలతో సంప్రదాయ దుస్తులను ధరిస్తారు. దీపావళి సెలవులకు ఇంటికి రాని యువతీ  యువకులు కూడా జమ్రా బీజ్ వేడుకల్లో పాల్గొనేందుకు తమ స్వగ్రామాలకు చేరుకుంటారు. రాత్రి 10 గంటలకు ప్రారంభమయ్యే తుపాకీ,  క్రాకర్ల ప్రదర్శన తెల్లవారుజాము వరకు కొనసాగింది. అనంతరం మహిళలు హోలికాపై రంగుల నీరు పోస్తారు. ఇది యుద్ధం, అల్లకల్లోలం ముగింపుకు అని ప్రతీక.

7 / 7
Follow us