Shukra Mahadasha: ఈ గ్రహం మహాదశలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి రాజులా జీవిస్తాడు.. 20 ఏళ్ల పాటు సుఖ, సంపదలు వీరి సొంతం

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు అన్ని రకాల భౌతిక ఆనందాల ప్రదాతగా పరిగణించబడుతున్నాడు. ఎవరి జాతకంలో శుక్ర గ్రహం శుభప్రదంగా ఉంటే.. ఆ వ్యక్తికి సంపదకు లోటు ఉండదు.

Shukra Mahadasha: ఈ గ్రహం మహాదశలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి రాజులా జీవిస్తాడు.. 20 ఏళ్ల పాటు సుఖ, సంపదలు వీరి సొంతం
Shukra Mahadasha
Follow us
Surya Kala

|

Updated on: Mar 11, 2023 | 7:45 AM

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం నవ గ్రహాలు ఉన్నాయి. ఇవి శుభ దృష్టిలో ఉన్న సమయంలో వ్యక్తి జీవితంలో అన్ని రకాల ఆనందాన్ని, సౌకర్యాన్ని ఇస్తాయి. వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శారీరక సంతోషానికి కారకుడు శుక్రుడు. జన్మరాశిలో శుక్రుడు శుభప్రదంగా ఉంటే.. ఆ వ్యక్తి విలాసవంతమైన జీవితం, ఆనందం, సంపద, అన్ని రకాల సుఖాలను పొందుతాడు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు అన్ని రకాల భౌతిక ఆనందాల ప్రదాతగా పరిగణించబడుతున్నాడు. ఎవరి జాతకంలో శుక్ర గ్రహం శుభప్రదంగా ఉంటే.. ఆ వ్యక్తికి సంపదకు లోటు ఉండదు. అలాంటి వ్యక్తి తన జీవితాన్ని చాలా విలాసవంతంగా గడుపుతాడు. వీరి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎవరి జాతకంలో బలంగా ఉంటాడో.. ఆ వ్యక్తులు ప్రేమలోని ఆనందాన్ని అనుభవిస్తారు. మరోవైపు ఎవరి జాతకంలో శుక్రుడు అశుభ ద్రుష్టి ఉంటే వారు తమ జీవితాన్ని కష్టాలు, నష్టాలతో గడుపుతారు.

శుక్రుడు శుభంగా ఉన్నప్పుడు ఇచ్చే ఫలాలు

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రుడు ఎవరి జాతకంలో ఉచ్ఛమైన రాశిలో లేదా స్నేహితుడి ఇంట్లో ఉంటే.. దానిని శుక్ర మహదశ అని అంటారు. శుక్ర గ్రహం మహాదశలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆనందం, కీర్తి, ఐశ్వర్యాన్ని పొందుతాడు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడిచిపోతుంది. జీవితంలో ఆనందం, విలాసవంతమైన జీవితం, రొమాన్స్ పెరుగుతాయి. శుక్రుని మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, జాతకంలో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నట్లయితే, ఆ వ్యక్తి అపారమైన ఆనందాన్ని పొందుతాడు.

ఇవి కూడా చదవండి

జాతకంలో శుక్రుడు నీచ స్థితిలో ఉంటే  

ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా శుక్రుని మహాదశ కిందకు వస్తాడు. శుక్రుని మహాదశ జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తికి శుభ లేదా అశుభ ఫలితాలు రావడానికి ఆ వ్యక్తి జాతకంలో శుక్రుడు ఎక్కడ, ఏ స్థితిలో ఉన్నాడు.. ఎవరితో ఉన్నాడో దానిపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు నీచ స్థితిలో ఉంటే ఆ వ్యక్తి ఆర్థిక, శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మనిషి జీవితంలో భౌతికంగా ఇబ్బందులను ఎదుర్కొంటాడు.  పిల్లల సంతోషాన్ని పొందడంలో కూడా మహిళలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

శుక్రుడు బలోపేతం చేయడానికి చేయాల్సిన పనులు

ఓం శుం శుక్రాయ నమః అని రోజుకు 108 సార్లు జపించాలి. శుక్రవారాల్లో ఉపవాసం పాటించాలి. ఈ రోజున చిన్నారులకు పాయసం తయారు చేసి తినిపించాలి. పంచదార బియ్యం పిండితో కలిపి శుక్రవారం చీమలకు తినిపించాలి. తెల్లటి ఆవుకి ప్రతిరోజు ఉదయం ఆహారం తినిపించాలి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)