Horoscope Today (March 11, 2023): వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.. 12 రాశులకు నేటి రాశిఫలాలు..

Daily Horoscope Today: 12 రాశుల వారికి శనివారం (మార్చి 11) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Horoscope Today (March 11, 2023): వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.. 12 రాశులకు నేటి రాశిఫలాలు..
Horoscope Image Credit source: TV9 Telugu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Mar 11, 2023 | 6:44 AM

మేషం ( అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంటాయి. ఉద్యోగ జీవితం చాలా వరకు హ్యాపీగానే సాగిపోతుంది. పుణ్యక్షేత్ర దర్శనానికి అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యలు ఎదురైనా లక్ష్యాలను పూర్తి చేస్తారు. కొద్ది ప్రయత్నాలతో అదనపు ఆదాయానికి అవకాశాలు మెరుగవుతాయి. పిల్లలు మంచి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4,, రోహిణి, మృగశిర 1,2)

ఇవి కూడా చదవండి

రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా సజావుగానే ఉంటుంది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఉద్యోగ జీవితం కూడా సాఫీగానే సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గతంలో అదనపు ఆదాయం కోసం చేసిన ప్రయత్నాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కొన్ని ముఖ్య అవసరాలను తీర్చుకుంటారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అన్నదమ్ములతో సయోధ్య పెరుగుతుంది. బంధువులకు సంబంధించిన ఒక శుభకార్యం లో పాల్గొంటారు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి స్నేహితుల సహాయంతో పరిష్కారం అవుతుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. ఇంటి పనుల విషయంలో తిప్పట ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారంలో శుభవార్త వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కొన్ని ముఖ్య అవసరాలను తీర్చుకుంటారు. కుటుంబ విషయాల్లో ఆవేశ కావేషాలు, మొండితనం పనికిరాదు. అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రాదనుకున్న డబ్బు తిరిగి వస్తుంది. దుబారా కారణంగా డబ్బు చేతిలో నిలిచే అవకాశం లేదు. ఉద్యోగ జీవితం కొద్దిగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. తొందరపాటు నిర్ణయాలతో లేదా అనవసర మాటలతో సమస్యలు కొని తెచ్చుకోవద్దు. వ్యక్తిగత విషయాల్లో సన్నిహితుల సహకారం తీసుకోవడం మంచిది. బంధువులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాల పరిస్థితి నిలకడగా ఉంటుంది. విద్యార్థుల మీద చదువుల భారం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగంలో లక్ష్యాలు పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యం పర్వాలేదు.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ట)

వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో అభివృధ్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాపారానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఒకటి రెండు ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. కొందరు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువుల సహాయంతో ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి తీపి కబురు అందే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బంది పడతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆశించిన డబ్బు చేతికి సకాలంలో అందే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆదాయ పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వాగ్దానాలు చేయటం, హామీలు ఉండటం మంచిది కాదు. బంధువుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి చికాకు పెడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. సహచరుల నుంచి సహకారం ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి వస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఒకటి రెండు ఆర్థిక సమస్యలు సానుకూలంగా పరిష్కారమై, మనసు ప్రశాంతంగా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ముందుకు దూసుకు వెళ్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. సహచరుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. హద్దులు దాటిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులకు విహారయాత్ర చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి పరవాలేదు అన్నట్టుగా ఉంటుంది. వాగ్దానాలకు, హామీలకు కొంతకాలం పాటు దూరంగా ఉండండి. నిరుద్యోగులకు సొంత ఊరులోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంతా క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. వ్యక్తిగత పనులు, ఇంటి పనులతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. అదనపు ఆదాయం కోసం చేస్తున్నప్రయత్నాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. వృత్తి వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం అవసరం. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించడం మంచిది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది.

(కౌశిక్, ప్రముఖ జ్యోతిష్య పండితులు)
Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్