Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: హమ్మయ్య.. కుజ బంధనం నుంచి ఆ రాశులవారికి విముక్తి.. ఇక వారు ‘నా దారి రహదారి‘ అంటారు.. అందులో మీరున్నారా?

జ్యోతిష శాస్త్రంలో కుజ గ్రహానికి కీలక స్థానం ఉంది. కుజ గ్రహ సంచారం ఆదారంగా ఆయా వ్యక్తుల భవిష్యవాణిని లెక్కిస్తారు. కుజ గ్రహ సంచారం సరిగ్గా లేకుంటే ఆ రాశుల వారు చాలా కష్ట,నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

Astrology: హమ్మయ్య.. కుజ బంధనం నుంచి ఆ రాశులవారికి విముక్తి.. ఇక వారు ‘నా దారి రహదారి‘ అంటారు.. అందులో మీరున్నారా?
Zodiac SignsImage Credit source: TV9 Telugu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 09, 2023 | 4:45 PM

Kuja Astrology:  జ్యోతిష శాస్త్రంలో కుజ గ్రహానికి కీలక స్థానం ఉంది. కుజ గ్రహ సంచారం ఆదారంగా ఆయా వ్యక్తుల భవిష్యవాణిని లెక్కిస్తారు. కుజ గ్రహ సంచారం సరిగ్గా లేకుంటే ఆ రాశుల వారు చాలా కష్ట,నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.  ఈ నెల 11వ తేదీ నుంచి కుజ స్తంభన తొలగిపోతుంది. కుజ గ్రహం వృషభ రాశి నుంచి మిధున రాశిలోకి ప్రవేశిస్తుంది. సుమారు అక్టోబర్ నుంచి కుజ గ్రహం వృషభ రాశి లోనే స్తంభించిపోయి మేష, వృషభ, వృశ్చిక, కుంభ రాశుల వారి జీవితాలను సమస్యల లోకి నెట్టివేసింది. ఈ రాశుల వారికి ఆరు నెలలుగా ఏ సమస్యా పరిష్కారం కాకుండా, ఏ పనీ పూర్తికాకుండా అనేక వ్యవహారాలు ఎక్కడివి అక్కడ ఆగిపోవడం జరిగింది. ఇక 11వ తేదీ నుంచి ఈ రాశుల వారి పనులన్నీ అతి వేగంగా ముందుకు సాగిపోతాయి. గత కొంతకాలంగా ఏర్పడిన అనేక ఆటంకాలు అవరోధాలు తొలగిపోతాయి.

1.మేష రాశి

ఈ రాశికి కుజుడు అధిపతి. ఈ కుజుడు మేషానికి రెండవ రాశి అయిన వృషభంలో స్తంభించిపోవటం వల్ల ఆదాయానికి కుటుంబానికి ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండా ఆగిపోయాయి. ఇలా ఆగిపోవడం వల్ల మేష రాశి వారిలో ఒక విధమైన నిరాశ నిస్సృహ నిరాసక్తత దిగులు ఏర్పడి ఉంటాయి. ఈనెల 11వ తేదీ నుంచి ఈ రాశి వారికి తప్పకుండా పనులన్నీ పూర్తవుతాయి. ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.

2.వృషభ రాశి

ఈ రాశిలో కుజుడు స్తంభించడం వల్ల ఈ రాశి వారి పురోగతి ఆగిపోయి ఉంటుంది. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందటానికి, వివాహ ప్రయత్నాలు ఆగిపోవడానికి, అనారోగ్యాలతో, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడటానికి, టెన్షన్లు పడటానికి ప్రధానంగా కుజ స్తంభనే కారణం అని గ్రహించాలి. రెండు మూడు రోజుల తర్వాత నుంచి ఈ పరిస్థితుల్లో క్రమంగా మార్పు రావటం మొదలవుతుంది. అతివేగంగా పురోగతి చెందడం ప్రారంభం అవుతుంది. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తి అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

3.వృశ్చిక రాశి

ఈ రాశికి కూడా కుజ గ్రహమే అధిపతి. గత ఆరు నెలలుగా కుజ గ్రహం స్తంభించి పోవడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు, కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే ప్రయత్నాలు ఆగిపోయి ఉంటాయి. కుజుడు మిధున రాశిలో ప్రవేశించిన క్షణం నుంచి ఈ రాశి వారికి అనేక విషయాలలో మంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు అతి తేలికగా పరిష్కారం అవుతాయి. మంచి చోట పెళ్లి సంబంధం కుదురుతుంది. ఈ రాశి వారి మీద పడిన నిందలు, అపనిందలు తొలగిపోతాయి. ముందుగా దాంపత్య జీవితంలోని అపార్ధాలు మాయమైపోతాయి.

4.కుంభ రాశి

ఈ రాశి వారికి నాలుగవ స్థానం అంటే సుఖ, గృహ వాహన స్థానంలో కుజగ్రహం స్తంభించిపోయి ఉంది. ఈ కారణంగా ఈ రాశి వారికి గత ఆరు నెలలుగా సుఖం తగ్గటం, మనశ్శాంతి కొరవడటం, అనుకోని కుటుంబ సమస్యలు తలెత్తడం, వాహన ప్రమాదాలకు గురికావడం, కింద పడటం, బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడటం వంటివి జరిగి ఉంటాయి. అయితే రెండు మూడు రోజుల తర్వాత నుంచి వీరికి ఇటువంటి సమస్యల నుంచి క్రమంగా విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా వీరిలో టెన్షన్లు ఆందోళనలు బాగా తగ్గి మనశ్శాంతి ఏర్పడుతుంది.
ముఖ్యమైన పరిహారాలు
ఈ రాశుల వారే కాకుండా ఇతర రాశుల వారు కూడా కుజ గ్రహం మిధునంలోకి ప్రవేశిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఒకటి రెండు పరిహారాలు చేసుకోవడం మంచిది. కుజుడి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలన్న పక్షంలో ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయించడం అవసరం. ఇంట్లో కానీ, ఆలయానికి వెళ్లి కానీ సుబ్రహ్మణ్యస్వామికి అర్చన లేదా పూజ చేయించడం వల్ల కుజగ్రహం సానుకూలంగా వ్యవహరిస్తుంది. ఇంట్లో ఉదయమే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
-కౌశిక్, ప్రముఖ జ్యోతిష్య పండితులు
(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..