AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venus Transit: మార్చి 12 మేషరాశిలోకి ప్రవేశించనున్న శుక్రుడు.. ఈ రాశులకు లక్కే లక్కు.. ఆకస్మిక ధన ప్రాప్తి..

మార్చి 12న శుక్రుడు అంగారకుడు అధిపతి అయిన మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మేషరాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ మూడు రాశుల వారికి ధనప్రాప్తి, పురోభివృద్ధి కలుగుతాయి. శుక్రుడు ఏ రాశుల వారికి ఎక్కువ లాభం చేకూర్చబోతున్నాడో తెలుసుకుందాం.

Venus Transit: మార్చి 12 మేషరాశిలోకి ప్రవేశించనున్న శుక్రుడు.. ఈ రాశులకు లక్కే లక్కు.. ఆకస్మిక ధన ప్రాప్తి..
Venus Planet Transit
Follow us
Surya Kala

|

Updated on: Mar 09, 2023 | 8:21 AM

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఒక గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడు.. ఈ సంచారం.. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. గ్రహాలు స్థానికులకు శుభ, అశుభ ప్రభావాలను ఇస్తాయి. మొత్తం 9 గ్రహాల్లో.. శుక్రుడు ప్రేమ, అందం, శృంగారం, ఆనందం, వైభవం, విలాసానికి కారకంగా పరిగణించబడుతున్నాడు. మార్చి 12న శుక్రుడు అంగారకుడు అధిపతి అయిన మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మేషరాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ మూడు రాశుల వారికి ధనప్రాప్తి, పురోభివృద్ధి కలుగుతాయి. శుక్రుడు ఏ రాశుల వారికి ఎక్కువ లాభం చేకూర్చబోతున్నాడో తెలుసుకుందాం.

మేషరాశి మేష రాశి వారికి మార్చి 12న శుక్రుని సంచారం శుభప్రదం కానుంది. ఈ రాశి వారి జాతకంలో మొదటి ఇంటిలో అంటే లగ్న గృహంలో శుక్రుని సంచారం జరగబోతోంది. ఇటువంటి పరిస్థితిలో.. ఈ రాశివారికి అన్నింటా అదృష్టం కలుగుతుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వీరి  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. సుఖ సంతోషాలు కలుగుతాయి. మరోవైపు, వివాహితులకు వారి జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.

మిధునరాశి మేషరాశిలో శుక్రుని సంచారం మిధున రాశి వారికి మంచి ప్రయోజనాలు తెస్తుంది. శుక్ర గ్రహం వీరి జాతకంలో ఆదాయ స్థలంలో సంచరిస్తుంది. ఈ  కారణంగా ఈ రాశివ్యక్తులు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మరోవైపు, వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు భారీ, మంచి ఒప్పందాన్ని చేసుకునే అవకాశం ఉంది. ఈ రాశి వ్యక్తులకు అన్ని సమయాలు  అనుకూలంగా ఉంటాయి. గౌరవం ,  కీర్తి పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి ఈ రాశి వారి జాతకంలో ఐదవ ఇంట్లో శుక్రుని సంచారం జరగనుంది. వీరి జాతకరీత్యా.. ఈ ఇంటిని పిల్లల ఆనందం, ప్రేమ సంబంధాల ఇల్లు అని పిలుస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ రాశి వ్యక్తులు పిల్లల నుండి కొన్ని శుభవార్తలను వినే అవకాశం ఉంది. ఈ రాశి వ్యక్తులకు విజయాన్ని, డబ్బును పొందేందుకు అనేక బంగారు అవకాశాలను కలిగించే మంచి ప్రతిపాదనలు ఎక్కడినుంచైనా రావచ్చు. ఉద్యోగ నిపుణులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)