Tirgrahi Yog: 30 ఏళ్ల తర్వాత కుంభంలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. మీరున్నరేమో చెక్ చేసుకోండి..

శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత సొంత రాశి కుంభంలో ఉన్నాడు..  ఇక్కడ బుధుడు, సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. కుంభరాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది.

Tirgrahi Yog: 30 ఏళ్ల తర్వాత కుంభంలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. మీరున్నరేమో చెక్ చేసుకోండి..
Tirgrahi Yog
Follow us
Surya Kala

|

Updated on: Mar 07, 2023 | 3:47 PM

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాలు, నక్షత్రరాశుల కదలిక వ్యక్తుల జీవితంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి జాతకంలో గ్రహాలు శుభప్రదంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు లభిస్తాయి. దీనికి విరుద్ధంగా, జాతకంలో గ్రహాల పరిస్థితి చెడుగా ఉన్నప్పుడు.. ఆ వ్యక్తులు అన్ని రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అన్ని గ్రహాలు ఒక క్రమ విరామంలో తమ రాశులను మార్చుకుంటాయి.. అయితే అనేక గ్రహాలు ఒకే రాశిలో వస్తే.. దానిని గ్రహాల సంయోగం అంటారు. ఇలా గ్రహాల సంయోగం ఏర్పడిన సమయంలో ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతుంది. కుంభరాశిలో అలాంటి కొన్ని గ్రహాల కూటమి ఏర్పడబోతోంది.

శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత సొంత రాశి కుంభంలో ఉన్నాడు..  ఇక్కడ బుధుడు, సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. కుంభరాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం..

వృషభ రాశి: వృషభరాశి వారికి కుంభరాశిలో శని-బుధ-సూర్యుడు కలయిక శుభప్రదం అవుతుంది. ఆర్థికంగా ఈ యోగం వృషభ రాశి వారికి బంగారు అవకాశాలను కలిగిస్తుంది. ఈ రాశి వ్యక్తుల జాతకంలో ఈ మూడు గ్రహాల సంచారం జరగబోతోంది. కనుక కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. ఆకస్మిక ధనలాభానికి సంకేతాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నవారు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. పని చేసే చోట మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ త్రిగ్రాహి యోగం ఈ రాశి వ్యక్తుల గౌరవాన్ని, కీర్తిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: కుంభరాశిలో శని-బుధుడు, సూర్యుని కలయిక జాతకంలో తొమ్మిదవ ఇంట్లో ఉండబోతోంది. జాతకంలో ఈ ప్రదేశం అదృష్టం, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో మిధున రాశి వారికి త్రిగ్రాహి యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సంయోగం వలన ఈ రాశి వ్యక్తులకు అనేక రకాల శుభవార్తలు వినిపించే సూచనలు ఉన్నాయి. మీరు పూర్వీకుల ఆస్తి నుండి డబ్బు  ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఒకే సమయంలో అనేక ప్రదేశాల నుండి మంచి ఉద్యోగ ఆఫర్లు అందుకోవచ్చు. ఈ రాశివారు ఆదాయంలో కూడా గణనీయమైన పెరుగుదల ఉండవచ్చు.  వ్యాపార రంగంలో సువర్ణావకాశాన్ని పొందవచ్చు. చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ కాలంలో కొన్ని కలలు కూడా నెరవేరుతాయి.

కుంభ రాశి కుంభరాశిలోనే త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల మీ లగ్న గృహాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ యోగం మీకు చాలా ప్రయోజనకరంగా,  అనుకూలమైనదిగా నిరూపించబడుతుంది. మంచి పురోగతి, మంచి సంపద కారణంగా మీ ఆత్మవిశ్వాసంతో పాటు  ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పులను తెస్తుంది. విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. గత కొన్ని రోజులుగా అపజయం పాలవుతున్న వారు ఇప్పుడు విజయానికి చేరువ అవుతారు. అకస్మాత్తుగా ధనలాభానికి అవకాశాలు కలుగుతాయి. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)